TS Govt Sanitary Napkins : విద్యార్థినులకు శానిటరీ న్యాప్కిన్లు
పేద పిల్లలకు ప్రభుత్వం భరోసా
TS Govt Sanitary Napkins : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బడులు, కాలేజీలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థినులకు మేలు చేకూర్చేలా ఇప్పటి వరకు న్యాప్కిన్లు పంపిణీ చేస్తోంది. తాజాగా శుభవార్త చెప్పింది. బాలికలు, యువతులు, విద్యార్థినులు ప్రతి నెలా మెన్సెస్ (రుతుక్రమం) సమస్యను ఎదుర్కొంటారు.
వీరికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు గాను ప్రతి నెలా విద్యార్థినులకు అవసరమయ్యే న్యాప్కిన్లను ఏడాదికి సరిపడా అందజేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థినుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లోని 8,9,10వ తరగతులు, ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోని దాదాపు 11 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా న్యాప్కిన్లు(TS Govt Sanitary Napkins) కిట్లను అందజేయనుంది.
మొత్తం 33 లక్షల కిట్లు పంపిణీ చేయనుంది. వీటికి సంబంధించి రాష్ట్ర సర్కార్ 69.52 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ కిట్లకు అడోల్సెంట్ కిట్లు అని పేరు పెట్టింది. ఈ ఏడాది బడ్జెట్ లో ఉచితంగా హెల్త్ అండ్ హైజినిక్ కిట్లు అందజేయనున్నట్లు ప్రకటించారు అసెంబ్లీలో సీఎం కేసీఆర్. కిట్లను కొనుగోలు చేసేందుకు గాను పరిపాలనా పరమైన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలకు , వచ్చే ఆర్థిక సంవత్సరానికి 22 లక్షల కిట్లు కొనుగోలు వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది.
ఇక తెలంగాణ ప్రభుత్వం అందించే అడోల్సెంట్ హైజీనిక్ కిట్ లో ఆరు శానిటరీ న్యాప్కిన్ల ప్యాకెట్ , ఒక వాటర్ బాటిల్ , వాటిని పెట్టుకునేందుకు ఓ బ్యాగ్ కూడా ఇస్తారు.
ఇక వచ్చే ఏడాది ఒక్కో స్టూడెంట్ కు 12 శానిటరీ న్యాప్కిన్ల ప్యాకెట్లు ఇస్తారు. అంటే ఏడాదికి సరిపడా అన్నమాట. ఈ మొత్తం కిట్లు 14 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన విద్యార్థినులకు లబ్ది చేకూరుతుందని సర్కార్ చెబుతోంది.
Also Read : తెలంగాణలో జనవరి 18 నుంచి కంటి వెలుగు