TS High Court : కేసీఆర్ సర్కార్ కు హైకోర్టు బిగ్ షాక్
వీఆర్ఓల సర్దుబాటుపై స్టే విధింపు
TS High Court : సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి కోలుకోలేని షాకిచ్చింది హైకోర్టు(TS High Court). గ్రామ రెవిన్యూ అధికారుల (వీఆర్ఓ)లను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం దారుణమని పేర్కొంది.
ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 121ను అమలు చేయడంపై స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు విఆర్ఓలను ఏ శాఖలోనూ సర్దుబాటు చేయవద్దంటూ ఆదేశించింది.
అంతే కాదు తుది తీర్పు ఇచ్చేంత దాకా వారిని రెవిన్యూ శాఖలోనే ఉంచాలని స్పష్టం చేసింది. ఒకవేళ తామిచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.
జివోలోని మూడో పేరాలోని విషయాలు యాక్ట్ 4(1)కి వ్యతిరేకంగా ఉన్నాయని , అందుకే జివోను నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది.
ఇప్పటి దాకా వేరే శాఖల్లో చేరని వారందరినీ ఇబ్బందులకు గురి చేయవద్దని, వారిని రెవిన్యూ శాఖలోనే ఉంచాలని ఆదేశించింది ప్రభుత్వాన్ని.
ఒక రకంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ, వేలాది ఖాళీలు ఉన్నా భర్తీ చేయకుండా తాత్సారం చేస్తున్న సర్కార్ కు ఈ తీర్పు, స్టే విధింపు
ఒక రకంగా చెంప దెబ్బ.
2 లక్షల ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ స్పష్టం చేసినా కేవలం 85 వేలు ఉన్నాయంటూ చిలుక పలుకులు పలికారు సీఎం. ఇప్పటి వరకు నోటిఫికేషన్లకు గతి లేదు.
ఉన్న ఖాళీలలో వీఆర్ఓలను భర్తీ చేస్తే 5 వేల కు పైగా పోస్టులు కోల్పోతారు నిరుద్యోగులు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
Also Read : మేరునగధీరుడు వెంకయ్య నాయుడు