TS High Court TSPSC : టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీలో స‌భ్యుల ఎంపిక‌పై ఫైర్

ఏ ప్రాతిప‌దిక‌న నియ‌మించార‌ని నిల‌దీత‌

TS High Court TSPSC : తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఏకి పారేసింది హైకోర్టు. తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో స‌భ్యుల నియామ‌కానికి సంబంధించి ప‌లు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తింది. ఒక ర‌కంగా చెంప ఛెళ్లుమ‌నిపించింది. రాష్ట్ర ఉద్య‌మం స‌మ‌యంలో పాల్గొన్న వారికి ఏమైనా ప్ర‌యారిటీ ఇచ్చారా లేక మీకు ఇష్టం వ‌చ్చిన వారిని అంద‌లం ఎక్కించారా అంటూ నిల‌దీసింది.

పోనీ ఉద్య‌మ‌కారుల‌కు ఏమైనా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించారా అని మండిప‌డింది. ఇదిలా ఉండ‌గా టీఎస్పీఎస్సీలో అన‌ర్హుల‌ను నియ‌మించారంటూ హైద‌రాబాద్ కు చెందిన ప్రొఫెస‌ర్ వినాయ‌క్ రెడ్డి గ‌త ఏడాది 2021 లో దావా దాఖ‌లు చేశారు రాష్ట్ర హైకోర్టులో(TS High Court TSPSC). ఈ సంద‌ర్బంగా హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ , జ‌స్టిస్ సీవీ భాస్క‌ర్ రెడ్డితో కూడిన ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది.

ప‌లు ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేసింది. తెలంగాణ కొత్త‌గా ఏర్ప‌డింది. త‌మ‌కు కూడా అవ‌కాశాలు రావాల‌ని ప్ర‌తి ఒక్క‌రు ఆశిస్తారు. ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో స‌భ్యుల నియామ‌కం జ‌రిగిన స‌మ‌యంలో ఏమైనా నోటిఫికేష‌న్ ఇచ్చారా అని ప్ర‌శ్నించింది. దీనికి ప్ర‌భుత్వం త‌ర‌పున ఏజీ బీఎస్ ప్ర‌సాద్ స్పందిస్తూ..ఉద్య‌మ‌కారులకే ప్ర‌యారిటీ ఇచ్చార‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాసనం తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యింది. అస్సోం ఉద్య‌మంలో పాల్గొని న‌ష్ట పోయిన వాళ్ల‌కు ఆనాటి సీఎం ప్ర‌పుల్ల కుమార్ మహంతి సీఎంగా ఉన్న స‌మ‌యంలో ప్ర‌త్యేక రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించార‌ని గుర్తు చేశారు. ఇక్క‌డ అలాంటిది ఏమైనా క‌ల్పిచారా అని నిల‌దీసింది. న‌చ్చిన వాళ్ల‌ను నియ‌మించారా అని ఫైర్ అయ్యింది. అప్లికేష‌న్లు అమ్మే పాన్ షాప్ లు వ‌ద్ద సభ్యులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారంటూ అంటూ నిప్పులు చెరిగింది.

Also Read : గ్రూప్ – 4 కొలువుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!