TS Inter Exams 2023 : ఇంటర్ పరీక్షలకు వేళాయెరా
నిమిషం ఆలస్యమైతే అనుమతించం
TS Inter Exams 2023 : తెలంగాణ రాష్ట్రంలో పరీక్షల సంబురం మొదలైంది. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు బిగ్ షాక్ ఇచ్చారు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్. పరీక్ష రాసే విద్యార్థులు ఎవరైనా సరే నిమిషం ఆలస్యమైనా తాము ఒప్పుకోమని, పరీక్ష హాలు లోకి అనుమితి ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. సాధ్యమైనంత వరకు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు ఓ గంట ముందు చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని లేక పోతే మీ భవిష్యత్తును మీరే పాడు చేసుకునే వాళ్లవుతారని వార్నింగ్ ఇచ్చారు. పరీక్ష పట్ల ఆ మాత్రం చిత్తశుద్ధి లేక పోతే ఎలా అని ప్రశ్నించారు నవీన్ మిట్టల్.
మార్చి 15న బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు(TS Inter Exams 2023) ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆధ్వర్యంలో సమీక్ష చేపట్టారు. ఆయా పరీక్షా కేంద్రాల నిర్వహణ, స్క్వాడ్ , ఏ విధంగా ఏర్పాట్లు చేశారనే దానిపై చర్చించారు. ఇక ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు వచ్చే నెల ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయని వెల్లడించారు.
పరీక్షల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రాల లోపటికి అనుమతి ఇస్తామన్నారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని సూచించారు. ఉచితంగా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్ష ప్యాడ్ చూపిస్తే చాలు ఎక్కడైనా బస్సులు ఆపుతారని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీకి ఆదేశాలు ఇచ్చామన్నారు.
Also Read : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్