TS Inter Results 2023 : తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డి

తొలి ఏడాదిలో 63.85 ..రెండో ఏడాదిలో 63.26 శాతం

TS Inter Results 2023 : తెలంగాణ ప్ర‌భుత్వం ఇంట‌ర్ ఫ‌లితాల‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వీటిని ప్ర‌క‌టించారు. ఇంట‌ర్ తొలి ఏడాదిలో 63.85 శాతం ఉత్తీర్ణ‌త సాధిస్తే, ఎండో ఏడాది ఇంట‌ర్ లో 63.26 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

గ‌త నెల మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దాదాపు 9 ల‌క్ష‌ల 50 వేల మంది విద్యార్థులు రాశారు. ఫ‌లితాల‌ను ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యంలో మంత్రి ప్ర‌క‌టించారు.

ఇక ఫ‌లితాల ప‌రంగా చూస్తే ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల్లో చివ‌రి స్థానంలో మెద‌క్ జిల్లా నిలిచింది. దీనికి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ప్రైవేట్ జూనియ‌ర్ కాలేజీల్లో 63 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా గురుకుల జూనియ‌ర్ కాలేజీల్లో 92 శాతం, సోష‌ల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం, బీసీ గురుకులాల్లో 87 శాతం, కేజీబీవీల‌లో 77 వాతం, గిరిజన గురుకులాల్లో 84 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.

ఇక ప‌రీక్ష‌ల‌కు సంబంధించి మే 10 నుచి రీ కౌంటింగ్ , రీ వాల్యూయేష‌న్ కి అవ‌కాశం ఉంది. ఈనెల 16 వ‌ర‌కు ఫీజు క‌ట్టొచ్చ‌ని తెలంగాణ ఇంట‌ర్ బోర్డు వెల్ల‌డించింది. మంగ‌ళ‌వారం సాయంత్రం నుంచే క‌ల‌ర్ మెమోలు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలు క‌ల్పించిన‌ట్లు బోర్డు కార్య‌ద‌ర్శి వెల్ల‌డించారు.

Also Read : 10న ప‌ద‌వ త‌ర‌గ‌తి ఫ‌లితాలు

Leave A Reply

Your Email Id will not be published!