TSPSC Group1 Results : గ్రూప్ – 1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు విడుద‌ల‌

ఎట్ట‌కేల‌కు రిలీజ్ చేసిన టీఎస్పీఎస్సీ

TSPSC Group1 Results : తీవ్ర విమ‌ర్శ‌లు, అనుమానాలు వ్య‌క్తం అవుతున్న త‌రుణంలో ఎట్ట‌కేల‌కు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల నిర్వ‌హించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప‌రీక్షకు సంబంధించిన ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. గ‌త కొంత కాలంగా పోస్టుల కోసం నానా తంటాలు ప‌డుతున్నారు నిరుద్యోగులు.

తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి నేటి దాకా కేవ‌లం పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకే ప్ర‌భుత్వం ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చింది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు రాబోతున్నాయి. ఈ త‌రుణంలో కాస్తో కూస్తో జాబ్స్ భ‌ర్తీ చేయాల‌ని సీఎం భావించారు. అందులో భాగంగానే నోటిఫికేష‌న్లు విడుద‌ల‌య్యాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రికి పోస్టింగ్ ఇవ్వ‌లేదు.

ఇచ్చిన దాఖ‌లాలు లేవు. దీంతో తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) పై అనుమానం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు. చివ‌ర‌కు గ్రూప్ -1 ప్రిలిమ్స్ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌లో నిర్ల‌క్ష్యం క‌నిపించింది. ప‌రీక్ష పేప‌ర్ ఇవ్వాల్సిన స‌మ‌యం కంటే ఆల‌స్యంగా ఇచ్చారు. దీనిపై అభ్య‌ర్థులు కోర్టును ఆశ్ర‌యించారు.

ప్ర‌స్తుతం కేసు విచార‌ణ‌లో ఉంది. దీనిపై విచారించిన ధ‌ర్మాస‌నం గ్రూప్ -1 ఫ‌లితాలు(TSPSC Group1 Results) వెల్ల‌డించేందుకు ఓకే చెప్పింది. దీంతో టీఎస్పీఎస్సీ శుక్ర‌వారం రాత్రి ప్రిలిమ్స్ రిజ‌ల్ట్స్ ను ప్ర‌క‌టించింది. ఇక మెయిన్స్ ప‌రీక్ష‌ను జూన్ నెలలో నిర్వ‌హిస్తామ‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది. తేదీని జ‌న‌వ‌రి 18న ప్ర‌క‌టిస్తామ‌ని టీఎస్పీఎస్సీ వెల్ల‌డించింది. మొత్తం 503 గ్రూప్ -1 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు రిజ‌ల్ట్స్ కోసం ఎదురు చూసిన వారు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read : కొత్త ప్ర‌పంచీక‌ర‌ణ దిశ‌గా కృషి చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!