TSPSC Chairman : నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు
రాజశేఖర్ రెడ్డి..ప్రవీణ్ కారణం
TSPSC Chairman Leak : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) లో చోటు చేసుకున్న పేపర్ లీకేజీ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ సంస్థ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి. నమ్మిన వాళ్లే నట్టేట ముంచారని వాపోయారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆయా పార్టీలు, సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. పూర్తిగా పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే తామంతకు తామే ఫిర్యాదు చేశామని తెలిపారు. ముందు జాగ్రత్తగా టీపీబివో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేశామన్నారు జనార్దన్ రెడ్డి. కమిషన్ కార్యాలయంలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని తెలిపారు.
ప్రతి విషయంలో పారదర్శకత ఉండేలా చూస్తున్నామని అందుకే పోలీసులకు ముందుగా సమాచారం అందజేశామని చెప్పారు. దయచేసి అభ్యర్థులు ఎలాంటి వదంతులు నమ్మవద్దని కోరారు. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను యథావిధిగా నిర్వహిస్తామన్నారు. ఇతర పరీక్షలకు సంబంధించి కొత్తగా ప్రశ్నా పత్రాలను తయారు చేయిస్తామని స్పష్టం చేశారు జనార్దన్ రెడ్డి.
ఇందులో భాగంగా టీపీబీవో పరీక్షతో పాటు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేశామని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి నెట్ వర్కింగ్ లో ఎక్స్ పర్ట్. గత ఆరు సంవత్సరాలుగా ఇక్కడే ఔట్ సోర్సింగ్ పద్దతిన జాబ్ చేస్తున్నాడు.
అతడికి అన్నీ తెలిసే అవకాశం ఉందన్నారు జనార్దన్ రెడ్డి(TSPSC Chairman Leak). కార్యాలయంలోని అన్ని కంప్యూటర్లకు చెందిన ఐపీ అడ్రస్ లు తెలియడం , ప్రవీణ్ పేపర్ లీక్ చేయడం జరిగిందని చెప్పారు టీఎస్ పీఎస్సీ చైర్మన్.
Also Read : రాజశేఖర్ రెడ్డి ఎక్స్ పర్ట్ ప్రవీణ్ ఖతర్నాక్