TSPSC GROUP 2 : గ్రూప్ -2 ప‌రీక్ష‌పై ఊసెత్త‌ని స‌ర్కార్

చైర్మ‌న్ స‌హా స‌భ్యుల రాజీనామా

TSPSC GROUP 2 : హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొత్త స‌ర్కార్ కొలువు తీరింది. దీంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) కీల‌క ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఊసెత్త‌డం లేదు. దీంతో ల‌క్ష‌లాది మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

TSPSC GROUP 2 Issue Viral

ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది టీఎస్పీఎస్సీ(TSPSC). బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే సీరియ‌స్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డితే తీవ్ర చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

సీఎం ఆదేశించ‌డంతో తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ వెంక‌ట్రామిరెడ్డితో పాటు స‌భ్యులు స్వ‌చ్చందంగా రాజీనామా చేశారు. ఒక్క సంత‌కంతో 54 ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల చైర్మ‌న్ లు, స‌భ్యులు రాజీనామా చేసేలా ఆదేశించారు.

ప్ర‌స్తుతం టీఎస్పీఎస్సీ చైర్మ‌న్, స‌భ్యుల‌ను ఇంకా నియ‌మించ లేదు. దీంతో ఇప్పుడు గ్రూప్ -2 ప‌రీక్ష వాయిదా ప‌డే అవ‌కాశం ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం వ‌చ్చే జ‌న‌వ‌రి 6,7 తేదీలలో ప‌రీక్ష జ‌రగాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు తేదీలు ద‌గ్గ‌ర ప‌డుతున్నా ఇంకా ఏర్పాట్లు చేయ‌లేదు. 783 పోస్టుల‌కు నోటీఫికేష‌న్ జారీ చేసింది. 5 ల‌క్ష‌ల 30 వేల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

Also Read : KA Paul : రేవంత్ రెడ్డితో పాల్ ముచ్చ‌ట

Leave A Reply

Your Email Id will not be published!