TSPSC Group 3 Jobs : టీఎస్పీఎస్సీ గ్రూప్ -3 నోటిఫికేషన్
1,365 పోస్టులకు పచ్చ జెండా
TSPSC Group 3 Jobs : టీఎస్పీఎస్సీ నిరుద్యోగులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎడా పెడా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క పోస్టు భర్తీ చేయలేదు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు తప్పా ఒరిగేది ఏమీ ఉండదని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమ్స్ పూర్తి చేసింది. గ్రూప్ -2తో పాటు ఇతర శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ.
ఇందులో భాగంగా 1,365 పోస్టులతో గ్రూప్ -3 నోటిఫికేషన్ ను(TSPSC Group 3 Jobs) రిలీజ్ చేసింది. మొత్తం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని 26 ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 107 రకాల పోస్టులను భర్తీ చేయనుంది.
ఇక వీటికి దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు గడువు విధించింది. అప్లికేషన్లు ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు. ఇక విడుదల చేసిన ఉద్యోగాలలో ఎక్కువగా ఆర్థిక శాఖకు సంబంధించినవే ఉన్నాయి.
ఉన్నత విద్యా శాఖలో 89 జాబ్స్ ఉండగా రెవెన్యూ శాఖలో 73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు రోజుల కిందట టీఎస్ పీఎస్సీ గ్రూప్ -2 , గ్రూప్ -4 నోటిఫికేషన్లను విడుదల చేసింది.
ఇక శాఖల వారీగా చూస్తే పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. వ్యవసాయ , సహకార శాఖలో 27 ఖాళీలు ఉండగా , పశు సంవర్దక శాఖలో 2, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో 27, విద్యుత్ శాఖలో 2, పర్యావరణం , అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలో 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఆర్థిక శాఖలో 712 ఉద్యోగాలు ఉండగా ఆహార, పౌర సరఫరాల శాఖ లో 16, సాధారణ పరిపాలన శాఖలో 46, ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖలో 39, ఉన్నత విద్యా శాఖలో 89, హోం శాఖలో 70, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖలో 25 , ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా సంస్థలో 1, కార్మిక , ఉపాధి శాఖలో 33 , మైనార్టీ సంక్షేమ శాఖలో 6 పోస్టులను భర్తీ చేయనుంది.
పురపాలిక పాలన, పట్టణ అభివృద్ది శాఖలో 18 పోస్టులు ఉండగా పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ది శాఖలో 29, ప్రణాళిక శాఖలో 3, రెవెన్యూ శాఖలో 73, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖలో 36, సెకండరీ ఎడ్యుకేషన్ లో 56, ట్రాన్స్ పోర్ట్ , రోడ్స్ అండ్ బిల్డింగ్స్ లో 12, ట్రైబల్ వెల్ఫేర్ లో 27, స్త్రీ శిశు సంక్షేమ శాఖలో 3 యూత్ , టూరిజం , కల్చర్ శాఖలో 5 , ట్ఐకార్ లో – 1 పోస్టు ఖాళీగా ఉంది.
Also Read : నిరుద్యోగులకు కొలువుల పండుగ