TSPSC Group-4 Jobs : గ్రూప్ – 4 కొలువుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

25 శాఖ‌ల్లో 9,168 పోస్టుల‌కు స‌ర్కార్ లైన్ క్లియ‌ర్

TSPSC Group-4 Jobs : భారీగా ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ స‌ర్కార్ ఓకే చెప్పింది. ఈ మేర‌కు తెలంగాణ పబ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) 25 శాఖ‌ల‌కు సంబంధించి ఖాళీగా ఉన్న 9,168 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. డిసెంబ‌ర్ 23 నుంచి జ‌న‌వ‌రి 12 దాకా ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తుంది. ఏప్రిల్ లేదా మార్చిలో ప‌రీక్ష చేప‌డుతుంది.

నోటిఫికేష‌న్ కు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను వెబ్ సైట్ లో పొందు ప‌ర్చిన‌ట్లు టీఎస్పీఎస్సీ వెల్ల‌డించింది. ఇక శాఖ‌ల వారీగా గ్రూపు – 4 ఉద్యోగాల వివ‌రాలు(TSPSC Group-4 Jobs)  ఇలా ఉన్నాయి.

బీసీ వెల్ఫేర్ శాఖ‌లో 307, ఆహార , పౌర స‌ర‌ఫ‌రాల శాఖ‌లో 72, ప‌శు సంవ‌ర్ద‌క‌, పాడి ప‌రిశ్ర‌మ‌, మ‌త్స్య శాఖ‌లో 2, వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార శాఖ‌లో 44 , ఆర్థిక శాఖ లో 255, సాధ‌ర‌ణ ప‌రిపాల‌న శాఖ‌లో 5, అట‌వీ, వాతావ‌ర‌ణ‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ లో 23 జాబ్స్ నింప‌నుంది.

వీటితో పాటు వైద్య ఆరోగ్య శాఖ‌లో 338 , ఉన్న‌త విద్యా శాఖ‌లో 742, హోం శాఖ‌లో 133, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌లో 7, నీటి పారుద‌ల శాఖ‌లో 51, కార్మిక‌, ఉపాధి శిక్ష‌ణా శాఖ‌లో 128, మైనార్టీ సంక్షేమ శాఖ‌లో 191, పురుపాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ‌లో 2701, పంచాయ‌తీరాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ‌లో 1245 ఖాళీగా ఉన్నాయి.

ప్ర‌ణాళిక శాఖ‌లో 2, రెవెన్యూ శాఖ‌లో 2077, ఎస్సీ డెవ‌ల‌ప్ మెంట్ శాఖ‌లో 474, సెకండ‌రీ ఎడ్యూకేష‌న్ లో 7, రోడ్డు, ర‌వాణా, భ‌వ‌నాల శాఖ‌లో 20, గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో 221, యువ‌జ‌న స‌ర్వీసులు, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ‌లో 13, స్త్రీ, శిశు, దివ్యాంగుల , సీనియ‌ర్ సిటిజ‌న్స్ శాఖ‌లో 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా నోటిఫికేష‌న్లు వేయ‌డ‌మే త‌ప్ప ఒక్క పోస్టును నియ‌మించిన దాఖ‌లాలు లేవు.

Also Read : టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీలో స‌భ్యుల ఎంపిక‌పై ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!