TSPSC Jobs : 1,392 లెక్చరర్ పోస్టుల భర్తీకి పచ్చ జెండా
నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ
TSPSC Jobs : ఓ వైపు ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు , నిరుద్యోగుల ఆగ్రహం చల్లార్చేందుకు కొత్త ప్లాన్ ఎత్తింది. ఈ మేరకు గత కొన్నేళ్లుగా భర్తీ చేయకుండా ఉంటూ వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఎడా పెడా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది.
ఇప్పటి వరకు ఒక్క పోస్టుకు సంబంధించి నియామక పత్రం ఇవ్వలేదు సర్కార్. తాజాగా జూనియర్ లెక్చరర్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ). ఇందులో మొత్తం 16 సబ్జెక్టులకు గాను 1,392 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 6 దాకా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఇక జూన్ లేదా జూలైలో పరీక్షలు చేపడతామని తెలిపింది టీఎస్పీఎస్సీ. నియామక సంస్థ చైర్మన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఇందులో భాగంగా జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటించారు చైర్మన్. మల్టీ జోన్ -1 పరిధిలో 724 పోస్టులు , మల్టీ జోన్ 2 పరిధిలో 668 పోస్టులు ఉన్నాయని టీఎస్పీఎస్సీ(TSPSC Jobs) వెల్లడించింది. వీటితో పాటు 91 ఫిజికల్ డైరెక్టర్ , 40 లైబ్రేరియన్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు లెక్చరర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై తమకు నమ్మకం లేదంటున్నారు నిరుద్యోగులు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ నోటిఫికేషన్లు వేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
Also Read : గ్రూప్స్ లో మరిన్ని పోస్టులకు సర్కార్ ఓకే