TSRTC Bill : ఆర్టీసీ విలీనంపై అసెంబ్లీలో బిల్లు
ప్రవేశ పెట్టనున్న తెలంగాణ సర్కార్
TSRTC Bill : తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్(KCR) నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందుకు సంబంధించి బిల్లును ఆగస్టు 3 గురువారం నుంచి ప్రారంభం అయ్యే శాసనసభ సమావేశాలలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు విధి విధానాలు, మార్గదర్శకాలు, ఒప్పందాలు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చిస్తోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.
TSRTC Bill For Acceptance
ఇతర రాష్ట్రాలలో ఎలా చేశారు. అక్కడ ఉన్న రూల్స్ ఏమిటి. తదితర వాటిపై ఇప్పటికే ఒకమారు చర్చించింది. ఒక సంస్థను విలీనం చేయాలంటే పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు కేసీఆర్.
మరో వైపు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణతో పాటు విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ దాసోజు శ్రవణ్ ను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద నియమిస్తున్నట్లు వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు క్యాబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.
వీరికి సంబంధించిన ఫైలును గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు పంపనుంది రాష్ట్ర సర్కార్. గతంలో పాడి కౌశిక్ రెడ్డి కి సంబంధించిన ఫైల్ ను వెనక్కి పంపింది.
Also Read : CM KCR : నిరంతర పోరాటం, ఒంటరిగా లేం – కేసీఆర్