Maha Shivratri TSRTC : మహాశివరాత్రికి దండిగా బస్సులు
వెల్లడించిన టీఎస్ఆర్టీసీ ఎండీ
Maha Shivratri TSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఖుష్ కబర్ చెప్పింది. దేశ వ్యాప్తంగా ఈనెల 18న మహా శివరాత్రి పర్వదినం జరుగుతుంది. ఇరు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వేలాది మంది నడక దారిన వస్తుండగా శ్రీశైలానికి మరికొందరు బస్సులను, ఇతర వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
తాజాగా టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని 40 శివాలయాలకు బస్సులను(Maha Shivratri TSRTC) నడుపుతున్నట్లు వెల్లడించారు. సంస్థ తరపున 2,427 బస్సులను ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు తిరుగుతాయని తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం ఏపీలోని శ్రీశైలం క్షేత్రానికి 578 బస్సులు, కరీంనగర్ జిల్లా లోని వేములవాడ ఆలయానికి 481 , మేడ్చల్ జిల్లా కీసరగుట్టకు 239 , మెదక్ జిల్లా ఏడుపాయలకు 497బస్సులు నడిపిస్తున్నట్లు ఎండీ వెల్లడించాడు.
మంచిర్యాల జిల్లా వేలాల గట్టు మల్లన్నకు 108 బస్సులు, భూపాలపల్లి జిల్లా లోని కాళేశ్వరానికి 51 , సిద్దిపేట జిల్లా కొమురవెల్లికి 52, జగిత్యాల జిల్లా కొండగట్టుకు 37 , గద్వాల జిల్లా ఆలంపూర్ కు 16 బస్సులు , ములుగు జిల్లా రామప్పకు 15, నాగర్ కర్నూల్ జిల్లా ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను(Maha Shivratri TSRTC) నడుపుతున్నట్లు పేర్కొన్నారు మేనేజింగ్ డైరెక్టర్.
ఇందులో భాగంగా శ్రీశైలం ఆలయానికి వెళ్లే భక్తులకు ఎంజీబీఎస్ , జేబీఎస్ , దిల్ షుఖ్ నగర్ , ఐఎస్ సదన్ , కేపీహెచ్ బీ కాలనీ , బీహెచ్ఈఎల్ నుంచి బస్సులు నడిపిస్తున్నట్లు తెలిపారు. అద్దెకు తీసుకుంటే రాయితీ కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఎండీ. ఇదిలా ఉండగా బస్సులు కావాల్సిన వాళ్లు 99592 26250, 9959226248, 9959226257, 9959226246, 040-27802203, 9959226250, 9959226149 ఈ నెంబర్లలో సంప్రదించాలని ఎండీ సూచించారు.
Also Read : గోవులకు వందనం..ఆలింగనం