TSRTC Sleeper Buses : ఏపీకి టీఎస్ఆర్టీసీ స్లీప‌ర్ బ‌స్సులు

ప్ర‌యాణీకుల‌కు మ‌రింత సౌక‌ర్యం

TSRTC Sleeper Buses : తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ గాడిన ప‌డుతోంది. ఖ‌ర్చుల నుంచి గ‌ట్టెక్కేందుకు వినూత్న ప్ర‌యోగాలు చేస్తోంది. ఇప్ప‌టికే కార్గో స‌ర్వీసులు కూడా ప్ర‌వేశ పెట్టింది. వాటి ద్వారా గ‌ణ‌నీయ‌మైన ఆదాయం స‌మ‌కూరుతోంది. ఇక పండుగ స‌మ‌యాల్లో అద‌న‌పు బ‌స్సుల‌ను న‌డుపుతోంది ఆర్టీసీ.

ఇదే క్ర‌మంలో గ‌తంలో అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేసే వారు. కానీ ఇప్పుడు దానికి చెక్ పెట్టింది టీఎస్ఆర్టీసీ. త్వ‌ర‌లోనే మ‌రో అద‌న‌పు సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. టికెట్ల‌కు సంబంధించి డిజిట‌ల్ పేమెంట్స్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇదే క్ర‌మంలో తిరుప‌తికి కూడా స్పెష‌ల్ ద‌ర్శ‌నంతో టికెట్ల‌ను ప్ర‌వేశ పెట్టింది.

మ‌రో వైపు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది టీఎస్ఆర్టీసీ. జ‌న‌వ‌రి 4 బుధ‌వారం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కీల‌క ప్రాంతాల‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ స్లీప‌ర్ బ‌స్సుల‌కు శ్రీ‌కారం చుట్టింది. మొద‌టి ద‌శ‌లో 10 బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి. వీటిలో 4 బ‌స్సులు పూర్తిగా స్లీప‌ర్ బ‌స్సులు, మ‌రో 6 బ‌స్సులు స్లీప‌ర్ క‌మ్ సీట‌ర‌ర్ బ‌స్సులు ఉన్నాయి.

సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌యాణం కోసం వీటిని ప్ర‌వేశ పెట్టిన‌ట్లు తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్. హైద‌రాబాద్ నుంచి కాకినాడ‌, హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ మ‌ధ్య ఈ బ‌స్సులు(TSRTC Sleeper Buses) తిర‌గ‌నున్నాయి. స్లీప‌ర్ బ‌స్సులలో 15 లోయ‌ర్ బెర్త్ లు, 15 అప్ప‌ర్ బెర్తులు ఉంటాయి. ప్ర‌తి స్లీప‌ర్ బెర్త్ వ‌ద్ద వాట‌ర్ బాటిల్ , ఛార్జింగ్ స‌దుపాయం ఉంది.

ఒక్కో బ‌స్సులో 33 సీట్లు క‌లిగి ఉంటుంది. ఇక కాకినాడ‌కు వెళ్లే బ‌స్సులు బీహెచ్ఎల్ నుంచి బ‌య‌లు దేరుతాయి. రాత్రి 7.45 కు ఒక‌టి, 830 గంట‌ల‌కు ప్ర‌యాణిస్తాయి. కాకినాడ నుంచి హైద‌రాబాద్ కు రాత్రి 7. 15 గంట‌ల‌కు , రాత్రి 7.45 గంట‌ల‌కు తిరిగి వ‌స్తాయి.

ఇక విజ‌య‌వాడకు వెళ్లే బ‌స్సులు ప్ర‌తి రోజూ మియాపూర్ నుంచి ఉద‌యం 9.30 గంట‌ల‌కు, 10.45 గంట‌ల‌కు, 11.45 గంట‌ల‌కు తిరిగి రాత్రి 9.30 గంట‌ల‌కు , 10.15, 11.15 గంట‌ల‌కు బ‌య‌లు దేరుతాయి. ఇక విజ‌య‌వాడ నుంచి ఉద‌యం 10.15, 11.15 గంట‌ల‌కు మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు , అర్ధ‌రాత్రి 12.00 , 12.45 గంట‌ల‌కు తిరుగు ప్ర‌యాణం చేస్తాయి.

Also Read : ఎక్సెల్ గ్రూప్ కంపెనీపై ఐటీ దాడులు

Leave A Reply

Your Email Id will not be published!