TSRTC Snack Box : ప్ర‌యాణీకుల‌కు ఎండీ ఖుష్ క‌బ‌ర్

టీఎస్ఆర్టీసీ స్నాక్ బాక్స్ ఏర్పాటు

TSRTC Snack Box : రోజు రోజుకు కీల‌క మార్పులు తీసుకు వ‌స్తున్నారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్. ఇప్ప‌టికే రోజూ వారీ ప్ర‌యాణ టికెట్ల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చారు. మ‌రో వైపు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాల‌తో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్రారంభించారు. ప్ర‌యాణీకుల‌కు జ‌ర్నీ స‌మ‌యంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను స‌రికొత్త ప్లాన్ చేశారు. ఈ మేర‌కు దూర ప్ర‌యాణం చేసే వారికి అందుబాటులో ఉండేలా స్నాక్ బాక్స్(Snack Box) ను ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు ఎండీ.

ఇప్ప‌టికే ఏసీ బ‌స్సుల్లో వాట‌ర్ బాటిల్ ను ఇస్తోంది సంస్థ‌. దీంతో పాటు స్నాక్ బాక్స్ ను అందించ‌నుంది ఇక నుంచి. పైలట్ ప్రాజెక్టుగా హైద‌రాబాద్ – విజ‌య‌వాడ ర‌హ‌దారిలో తిరిగే 9 విద్యుత్ ఈ గ‌రుడ బ‌స్సుల‌లో అంద‌జేయ‌నున్నారు. ప్ర‌యాణీకుల నుంచి వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టి మిగ‌తా బ‌స్సుల్లో ఏర్పాటు చేస్తారు.

ఇక ఈ స్నాక్ బాక్స్ లో చిరు ధాన్యాల‌తో త‌యారు చేసిన కారా, చిక్కీ ప్యాకెట్ల‌తో పాటు మౌత్ ప్రెష‌న‌ర్ , టిష్యూ పేప‌ర్ ఉంటాయి. స్నాక్ బాక్స్ కోసం టికెట్ ధ‌ర‌లోనే రూ. 30 నామ మాత్ర‌పు ధ‌ర‌ను నిర్ణ‌యించిన‌ట్లు ఎండీ వీసీ స‌జ్జ‌నార్ వెల్ల‌డించారు. 2023 సంవ‌త్స‌రాన్ని ఐక్య రాజ్య స‌మితి చిరు ధాన్యాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించింది. దీనిని ప్రోత్స‌హించేందుకు తాము ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి స్నాక్ బాక్స్ లో క్యూ ఆర్ కోడ్ ఉంటుంద‌న్నారు. విలువైన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని కోరారు.

Also Read : Manmohan Singh

Leave A Reply

Your Email Id will not be published!