TSRTC MD Sajjanar : ప్రయాణీకులకు ఆర్టీసీ తీపి కబురు
టి24 టికెట్ రూ.10 తగ్గింపు
TSRTC MD Sajjanar : ప్రయాణీకులకు విశిష్ట సేవలు అందిస్తున్న తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. 24 గంటల పాటు ప్రయాణం చేసేందుకు రూ. 100 చెల్లించాల్సి వచ్చేది. వేసవిని దృష్టిలో పెట్టుకుని టి-24 టికెట్ పై రూ. 10 తగ్గించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు సజ్జనార్(TSRTC MD Sajjanar) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈ సౌకర్యం హైదరాబాద్ లోని నగర పౌరులకు ఇది మేలు చేకూరుతుందని తెలిపారు ఎండీ. ప్రయాణీకులకు దీని వల్ల కొంత మేర ఆర్థిక భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. అంతే కాకుండా సీనియర్ సిటిజన్లకు టి-24 టికెట్ ధరను రూ. 80కే అందజేస్తున్నట్లు పేర్కొన్నారు ఆర్టీసీ ఎండీ. సీనియర్ సిటిజన్లు తమ వద్ద ఉన్న ఆధార్ కార్డును కండక్టర్ కు చూపించాలని స్పష్టం చేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్ ధరలో 20 శాతం రాయితీ లభిస్తుందని తెలిపారు.
సవరించిన టి24 టికెట్ ధరలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్(TSRTC MD Sajjanar). గతంలో ఇదే టికెట్ ధర రూ. 120గా ఉండేది. ప్రయాణీకుల అభ్యర్థన మేరకు దానిని రూ. 100కి తగ్గించింది.
ఇదిలా ఉండగా టి24 టికెట్ కు ఆదరణ లభిస్తోందని చెప్పారు ఎండీ. ప్రతి రోజూ 25 వేల వరకు టికెట్లు అమ్ముడు పోతున్నాయని వెల్లడించారు. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామన్నారు. రూ. 50కి ఆ టికెట్ కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు వర్తిస్తుందన్నారు.
Also Read : 30న సచివాలయానికి మోక్షం