TSRTC MD Sajjanar : ప్ర‌యాణీకుల కోసం ట్రాకింగ్ యాప్

గ‌మ్యం పేరు పెట్టామ‌న్న వీసీ స‌జ్జ‌నార్

TSRTC MD Sajjanar : తెలంగాణ ఆర్టీసీ మ‌రో కొత్త ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టింది. సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకుని ప్ర‌యాణీకుల‌కు మ‌రింత చేరువ అయ్యేందుకు మ‌రో ముంద‌డుగు వేసింది. అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో బ‌స్ ట్రాకింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చింది. దీనికి గ‌మ్యం అని పేరు పెట్టింది. శ‌నివారం ఎంజీబీఎస్ లో ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్(TSRTC MD Sajjanar) యాప్ ను ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు.

TSRTC MD Sajjanar Introduce New App

లోగోను కూడా ఆవిష్క‌రించారు. ముందుగా ఆర్టీసీ ఉద్యోగుల‌కు, రాష్ట్ర స‌ర్కార్ కు , సీఎంకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌భుత్వం తీసుకున్న గొప్ప నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ‌లు అందించాల‌ని కోరారు.

గ‌త రెండేళ్లుగా ప్ర‌జ‌ల‌కు ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను ద‌గ్గ‌ర చేసేందుకు ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు ఆర్టీసీ యాజ‌మాన్యం శ్రీ‌కారం చుట్టింద‌న్నారు ఎండీ. ప్ర‌తి రోజూ 45 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణీకుల‌ను త‌మ త‌మ గ‌మ్య స్థానాల‌ను చేరుస్తోంద‌న్నారు. అత్యాధునిక హంగుల‌తో కూడిన 776 బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన‌ట్లు చెప్పారు సజ్జ‌నార్. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే బ‌స్సుల స‌మాచారమంతా తెలుసు కోవ‌చ్చ‌న్నారు. ప్ర‌స్తుతం 4,170 బ‌స్సుల‌కు ట్రాకింగ్ స‌దుపాయం క‌ల్పించిన‌ట్లు తెలిపారు.

Also Read : Pawan Kalyan Driver : గ్రీన్ ట్యాక్స్ పై డ్రైవ‌ర‌న్న ఆవేద‌న

Leave A Reply

Your Email Id will not be published!