TSRTC MD : శిక్షణతోనే సక్సెస్ సాధ్యం – సజ్జనార్
డిపో మేనేజర్లకు ట్రైనింగ్
TSRTC MD : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్(TSRTC MD) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉన్నత స్థానంలో ఉన్న వారికి నిరంతరం ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని, వాటిని అధిగమించేందుకు శిక్షణ ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ లోని బస్ భవన్ లో పదోన్నతి పొందిన 8 మంది డిపో మేనేజర్లకు నాలుగు రోజుల పాటు శిక్షణ కార్యక్రమారి ఎండీ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా శిక్షణకు సంబంధించిన కోర్టు మెటీరియల్ ను డీఎంలకు అందజేశారు.
ఎవరు ఏ స్థానంలో ఉన్నా చేస్తున్న పనిలో , విధుల్లో ఫోకస్ పెట్టాలని సూచించారు. దీని వల్ల అదనపు బలం వస్తుందన్నారు. ప్రతి రంగంలో, ప్రతి చోటా సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయని దీనిని తట్టుకుని నిలబడే శక్తి సామర్థ్యాలను కలిగి ఉండాలని సూచించారు. ఎదుర్కొనే స్థైర్యం రావాలంటే శిక్షణ అద్భుతంగా తోడ్పుడుతుందని పేర్కొన్నారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్.
గతంలో కంటే ప్రస్తుతం ఆర్టీసీ సంస్థ ప్రగతి పథంలో ముందుకు వెళుతోందని , మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు మరింతగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ఎండీ. ఇవాళ పెద్ద ఎత్తున ఆర్టీసీని ప్రయాణికులు, ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు.
Also Read : CM YS Jagan : విద్యా రంగంలో టెక్నాలజీ ముఖ్యం