TSRTC Radio : ఆర్టీసీ బస్సుల్లో వింటూనే ఉండండి
ఎఫ్ఎం రేడియో సౌకర్యం ఏర్పాటు
TSRTC Radio : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోజు రోజుకు కీలక మార్పులు తీసుకు వస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే లాజిస్టిక్ ను స్టార్ట్ చేసింది. గత ఏడాది 37 కోట్లు ఆదాయం సాధించగా 2022లోరూ. 67 కోట్లు సమకూరింది. ప్రస్తుతం ఆర్టీసిని గట్టెక్కించే బాధ్యతను మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ భుజాన వేసుకున్నారు.
కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దేవాలయాల సందర్శన కోసం , హైదరాబాద్ ను చూసేందుకు కూడా ఇటీవల బస్సులను ఏర్పాటు చేశారు. మరో వైపు నగరంలోని ఐటీ కంపెనీలలో పని చేసే ఉద్యోగుల కోసం అత్యాధునిక బస్సులను ప్రారంభించారు ఎండీ. తాజాగా నగరలోని ప్రయాణీకులకు ఖుష్ కబర్ చెప్పారు ఎండీ.
ఈ మేరకు ఇక నుంచి ప్రయోగాత్మకంగా 9 బస్సుల్లో ఎఫ్ఎం రేడియోను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఎండీ సజ్జనార్. వినోదాన్ని, సంతోషాన్ని కలిగించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకోసం టీఎస్ఆర్టీసీ రేడియోను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు ఎండీ. ప్రస్తుతానికి పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ సిటీ లోని 9 ఆర్డినరీ , మెట్రో బస్సులలో ఈ రేడియో ను(TSRTC Radio) అందుబాటు లోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ లోని బస్ భవన్ లో కూకట్ పల్లి డిపో బస్సులో ఈ రేడియోను వీసీ సజ్జనార్ శనివారం ప్రారంభించారు.
ఈ రేడియోలో వినోదానికి సంబంధించిన పాటలతో పాటు ఆర్టీసీ అందిస్తున్న సేవలు, నీతి కథలు కూడా ఉంటాయని తెలిపారు ఎండీ.
Also Read : మోడీపై కేటీఆర్ సెటైర్