TSRTC Protest : గవర్నర్ కు ఆర్టీసీ ఉద్యోగుల అల్టిమేటం
బిల్లును ఆమోదించక పోతే రాజ్ భవన్ ముట్టడి
TSRTC Protest : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు మోకాలడ్డుతున్న రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బిల్లుకు ఆమోదించక పోవడాన్ని నిరసిస్తూ బంద్ పాటిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
TSRTC Protest Viral
ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీని(TSRTC) ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బిల్లును సభలో ప్రవేశ పెడతామని, గవర్నర్ ఆమోదానికి పంపిస్తామని స్పష్టం చేశారు.
యధావిధిగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసిని సర్కార్ లో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించి రూపొందించిన బిల్లును రాజ్ భవన్ కు పంపింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ ఫైల్ ను నిలిపి వేసింది. దీనిపై తనకు అభ్యంతరాలు ఉన్నాయని తెలుపడంతో బిల్లు ప్రక్రియ ఆగి పోయింది. దీనిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఆర్టీసీ ఉద్యోగులు.
బిల్లును ఆమోదించేంత వరకు తాము ఊరుకునే ప్రసక్తి లేదని, రాజ్ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Also Read : TSRTC Bandh : రాష్ట్రమంతటా బస్సులు బంద్