TSRTC WIFI : టీఎస్ఆర్టీసీ వైఫై ఫ్రీ
ప్రయాణీకులకు ఖుష్ కబర్
TSRTC WIFI : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు చెప్పింది. నిత్యం లక్షలాది మంది ప్రతి రోజూ తమ పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంటారు. ప్రస్తుతం టెక్నాలజీతో సదరు సంస్థ అనుసంధానం అవుతోంది. ఇప్పటికే ప్రయాణీకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్(VC-Sajjanar) ప్రయత్నం చేస్తున్నారు.
TSRTC WIFI Free
ఇందుకు గాను తాము ప్రయాణం చేసే బస్సుల వివరాలు, ఛార్జీలు, రిజర్వేషన్ సౌకర్యం, బస్సులు ఏయే రూట్లలో వెళుతుందనే దానికి సంబంధించి గమ్యం పేరుతో ఆర్టీసీ యాప్ ను ప్రారంభించింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన లభించింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట వైపు మళ్లించేందుకు నానా తంటాలు పడుతున్నారు సజ్జనార్. పలు టికెట్లను కూడా ప్రవేశ పెట్టారు. భారీ ఎత్తున వసతులు కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో తాజాగా సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ లో ఐటీ, ఇతర కంపెనీలకు చెందిన వారు వేలాది మంది సిటీ బస్సులలో ప్రయాణం చేస్తుంటారు.
వీరందరికీ తమ అవసరాలను తీర్చుకునేందుకు గాను బస్సులలో ప్రయాణం చేసే ప్రయాణీకులకు ఖుష్ కబర్ చెప్పింది. ఉచితంగా వై ఫై సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. వైఫై నేమ్ టీఎస్ఆర్టీసీ, పాస్ వర్డ్ టీఎస్ఆర్టీసీ 123 అని టైప్ చేస్తే చాలు. కావాల్సినంత నెట్ వాడుకోవచ్చన్నమాట.
Also Read : Shashi Tharoor : భారత్ పై శశి థరూర్ కామెంట్స్