TTD Chairman Bhumana : టీటీడీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman Bhumana : టీటీడీ ఉద్యోగులకు తీపి కబురు చెప్పారు కొత్తగా కొలువు తీరిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికీ ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. ఈవో ధర్మారెడ్డితో కలిసి వడమాల పేట వద్ద ఉన్న ఇంటి స్థలాలను చైర్మన్ పరిశీలించారు. అందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఉద్యోగులు అంతర్గత ఇబ్బందులు ఉంటే వాటిని పక్కన పెట్టి తనకు సహకరించాలని కోరారు భూమన.
TTD Chairman Bhumana Said Good News to TTD Employees
ఇదిలా ఉండగా వడమాల పేట వద్ద టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం 310 ఎకరాల భూమిని మంజూరు చేశారు. ఈ సందర్భంగా టీడీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(TTD Chairman Bhumana) మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 18న సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అవసరమైతే మరో 100 ఎకరాలైనా ప్రభుత్వం నుండి సేకరిస్తామని, ప్రతి ఒక్కరికీ స్థలం వచ్చేలా చూస్తామన్నారు.
టీటీడీ చైర్మన్ చేసిన సంచలన ప్రకటనతో టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాను ఉద్యోగులతో స్నేహ పూర్వకమైన సంబంధాన్ని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఆనాడు టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఇంటి స్థలాలు సేకరించానని 10 ఏళ్లయినా ఇప్పటి వరకు ఈ సమస్యను పట్టించు కోలేదన్నారు భూమన.
Also Read : CM KCR Linemen : విద్యుత్ లైన్ మెన్ కు కేసీఆర్ సత్కారం