TTD Chairman Bhumana : ఏర్పాట్లపై భక్తులతో చైర్మన్ ఆరా
నవరాత్రి బ్రహ్మోత్సవాలు
TTD Chairman Bhumana : తిరుమల – దసరా పండుగ వేళ ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో అక్టోబర్ మాసంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తోంది. ఈసారి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. అక్టోబర్ 23 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
TTD Chairman Bhumana Interact with Devotees
ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ చేపట్టారు. భారీ ఎత్తున భక్తులు తిరుమల పుణ్య క్షేత్రానికి చేరుకున్నారు. కాగా భక్తులకు అందజేస్తున్న అన్న ప్రసాదాలు, వసతి సౌకర్యాలను స్వయంగా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి , కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి పరిశీలించారు.
ఆయా గ్యాలరీలలో కొలువు తీరిన భక్తులను స్వయంగా పలుకరించారు. తాము ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. తాగు నీరు, మజ్జితతో పాటు అన్న ప్రసాదాలను నిరంతరం ఇస్తున్నారని భక్తులు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తెలిపారు.
ఇక నాలుగు మాడ వీధుల్లో వేచి ఉన్న భక్తులకు తెల్లవారు జాము నుంచి అంకిత భావంతో, భక్తి శ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి సేవకుల సేవలను టీటీడీ ఛైర్మన్, ఈవో కొనియాడారు. దాదాపు 2500 మంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదాల ప్యాకింగ్, గ్యాలరీలలో అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయడాన్ని అభినందించారు.
Also Read : Indrakeeladri Temple : దుర్గమ్మ కోసం పోటెత్తిన భక్తజనం