TTD Chairman : వినాయక నిమజ్జనం సంపూర్ణ సహకారం
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే వినాయక నిమజ్జనం కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 22న గరుడ సేవ జరుగుతుందని తెలిపారు.
TTD Chairman Comments
వినాయక నిమజ్జనాలు జరగకుండా చూడాలని సూచించారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేందుకు గత ఏడాది లాగే ఈసారి కూడా టీటీడీ(TTD) వైపు నుండి అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు భూమన కరుణాకర్ రెడ్డి.
వినాయక సాగర్ వద్ద భక్తులందరికీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారికి చెందిన కుంకుమ, కంకణాలు అందజేస్తామని చెప్పారు. ఈ సారి ఉత్సవాలకు తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందన్నారు.
అధికార యంత్రాగం పూర్తిగా ఉత్సవాలపై ఫోకస్ పెట్టనుందని, దీంతో నిమజ్జన కార్యక్రమాన్ని వాయిదా వేసు కోవాలని టీటీడీ చైర్మన్ సూచించారు. టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అవసరమైన మేరకు ధార్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుపతి నగర పాలక సంస్థ అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి.
Also Read : AP CM YS Jagan : రైతుల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం