TTD Chairman : భ‌క్తుల భ‌ద్ర‌త విష‌యంలో రాజీ ప‌డం

టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి

TTD Chairman : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నిన్న చిన్నారి మృతి చెందిన ఘ‌ట‌న‌కు టీటీడీ భ‌ద్ర‌తా వైఫ‌ల్యమేన‌ని ఆరోప‌ణ‌లు రావ‌డంతో శ‌నివారం చైర్మ‌న్ స్పందించారు. శ‌నివారం మీడియాతో మాట్లాడారు. భ‌ద్ర‌తకు సంబంధించి ఎక్క‌డా రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. సంఘ‌ట‌న జ‌రగ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఇలాంటివి జ‌ర‌గ‌కుండా మున్ముందు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. బాలిక మృతి చెందిన ప్రాంతాన్ని సంద‌ర్శించామ‌న్నారు.

TTD Chairman Words For Devotees Security

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తుల సెక్యూరిటీకి సంబంధించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. క్రూర మృగం బాలిక‌ను ఎలా అడ‌వి లోకి తీసుకుని వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌నే విష‌యాన్ని అట‌వీ, టీటీడీ(TTD) , విజిలెన్స్ ఆఫీస‌ర్లు చైర్మ‌న్ కు వివ‌రించారు.

గ‌త జూన్ 22న ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింద‌ని ఈ నేప‌థ్యంలో టీటీడీ సెక్యూరిటీ అల‌ర్ట్ అయ్యింద‌న్నారు. సాంకేతిక‌తంగా ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై ఆలోచిస్తామ‌న్నారు. త‌గు సూచ‌న‌లు, జాగ్ర‌త్త‌లు సూచిస్తే టీటీడీ ఖ‌ర్చుతో ఏర్పాటు చేస్తామ‌ని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి చెప్పారు.

అట‌వీ సంర‌క్ష‌ణ చ‌ట్టాలు స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు జ‌రుగుతున్నాయ‌ని, వ‌న్య ప్రాణుల సంఖ్య పెరిగింద‌న్నారు. భ‌క్తులు వీటి బారిన ప‌డ‌కుండా ఎలా ర‌క్ష‌ణ క‌ల్పించాల‌నే దానిపై టీటీడీ ఆలోచిస్తుంద‌న్నారు. బాలిక కుటుంబాన్ని టీటీడీ త‌ర‌పున ఆదుకుంటామ‌న్నారు.

Also Read : TSRTC MD Sajjanar : ప్ర‌యాణీకుల కోసం ట్రాకింగ్ యాప్

Leave A Reply

Your Email Id will not be published!