TTD Chairman : శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

టీటీడీ చైర్మ‌న్ భూమన కరుణాకర రెడ్డి

TTD Chairman : తిరుమల – తిరుమ‌ల‌లో నిత్యం వ‌చ్చే భ‌క్తుల‌కు నిస్వార్థంగా సేవ‌లు అందించ‌డంలో శ్రీ‌వారి సేవ‌కులు కీల‌క పాత్ర పోషిస్తున్నారంటూ కొనియాడారు టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. సనాతన హిందూ ధర్మ జ్యోతులుగా అభివ‌ర్ణించారు.

TTD Chairman Comment

తిరుమల శ్రీవారి సేవా సదన్ -2లో శ్రీవారి సేవకులను ఉద్దేశించి ఛైర్మన్(TTD Chairman) మాట్లాడారు. టీటీడీ 23 సంవత్సరాల క్రితం కేవలం 200 మంది సేవకులతో శ్రీవారి సేవను ప్రారంభించిందని చెప్పారు. ప్రస్తుతం రోజుకు 2,000 మందికి తక్కువ కాకుండా సేవలందిస్తున్నారని తెలిపారు.

ఇప్పటి వరకు సుమారు 14 లక్షల మంది శ్రీవారి సేవకులు తిరుమల, తిరుపతిలో భక్తులకు సేవలందించారని వెల్లడించారు. శ్రీవారి భక్తులకు సేవ చేస్తూ స్వామి వారి కీర్తిని దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్న సేవకులు ధన్యులన్నారు. నిస్వార్థ సేవలను కొనసాగించాలని, స్వచ్ఛంద సేవలో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు.

అంతకు ముందు ప్రఖ్యాత గాయకులు శ్రీనిధి, పవన్ చరణ్ అన్నమాచార్య కృతులను అద్భుతంగా ఆలపించారు. అనంతరం గరుడ సేవ కోసం ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా శ్రీవారి సేవకులకు ఆలయ విధులను టీటీడీ ఛైర్మన్ చేతుల మీదుగా కేటాయించారు.

Also Read : Tirumala Kalarupalu : తిరుమ‌ల‌లో తెలంగాణ క‌ళారూపాలు

Leave A Reply

Your Email Id will not be published!