TTD Chairman : కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
TTD Chairman : తిరుమల – టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖుష్ కబర్ చెప్పారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్నేళ్లుగా కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న ప్రతి ఒక్కరినీ పర్మినెంట్ చేస్తామని ప్రకటించారు. మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకుంది. జీవో 114 ప్రకారం కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కు ఖుష్ కబర్ చెప్పారు.
TTD Chairman Comment
దీని వల్ల వందలాది కుటుంబాలకు మేలు చేకూరుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని , ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు టీటీడీ చైర్మన్(TTD Chairman) భూమన కరుణాకర్ రెడ్డి.
ఇదిలా ఉండగా అంతకుముందు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని శోభాయాత్రగా తిరుచానూరుకు తీసుకొచ్చారు. ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు టీటీడీ చైర్మన్. 18న చివరి రోజు పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.
అంతకు ముందు తిరుమలలో శ్రీవారి ఆలయం నుండి ఈ హారాన్ని ఆలయ నాలుగు వీధుల్లో శోభా యాత్ర నిర్వహించి తిరుచానూరుకు తీసుకొచ్చారు. ఈవో ఏవీ. ధర్మారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాధం పాల్గొన్నారు.
Also Read : Minister KTR : బీఆర్ఎస్ కు 80 సీట్లు పక్కా