YV Subba Reddy : ఎందరో మహానుభావులు. మరెందరో కారణజన్ములు. ఈ దేశం పుణ్యభూమిగా ప్రసిద్ది చెందింది. భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన వారు ఎందరో ఉన్నారు.
ఆధ్యాత్మికత భావ జలధారను ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తున్న పీఠాధిపతులు, భగవత్ స్వరూపులలో శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు ఒకరు.
ఆయన ఎవరికీ అందని ఎన్ సైక్లోపేడియా లాంటి వారు. పలు భాషలలో ప్రావీణ్యం కలిగిన ఆయన ఉపనిషత్తులు, వేదాలు, ఇతిహాసాలు ఇలా ప్రతి దానిపై పట్టుంది.
స్వామి వారి చల్లని చూపు కోసం, ఆయన అందించే మంగళా శాసనాల కోసం, తీర్థం కోసం వేలాది మంది భక్తులు వేచి చూస్తారు.
చిన్న జీయర్ స్వామి వారు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో దేశానికే ఆదర్శంగా ఉండేలా 216 అడుగులతో ఆనాటి వెయ్యేళ్ల రామానుజుడి సమతామూర్తి విగ్రహాన్ని ముచ్చింతల్ లో ఏర్పాటు చేశారు
. శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సహస్రాబ్ది మహోత్సవాలలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు చిన్న జీయర్ స్వామి.
అదే సమయంలో అపర భక్తుడైన, టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డిని ప్రేమ పూర్వకంగా ఆశీర్వచనం చేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ జీయర్ స్వామి. అంతే కాదు శాలువాతో సత్కరించి సమతామూర్తి ప్రతిమను అందజేశారు.
ఈ ఉత్సవాల వేళ చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు అందుకోవడం అంటే సాక్షాత్తు ఆ భగవత్ రామానుజులు, తిరుమలలో కొలువై ఉన్న గోవిందుడు ఆశీర్వదించినట్లే. ఏది ఏమైనా వైవీఎస్ జన్మ ధన్యమైందని చెప్పక తప్పదు.
Also Read : జగన్ అద్బుతమైన పాలకుడు