YV Subba Reddy : త్వరలో విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీస్
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడి
YV Subba Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం క్యాంపు ఆఫీసు పై కీలక వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని రేపింది. ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతి ఉండగా ప్రభుత్వం మారడంతో వైసీపీ పవర్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీకి రాజధాని మార్చుతున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి మూడు కేపిటల్ సిటీస్ ను ఏర్పాటు చేయనున్నట్లు జనం సాక్షిగా వెల్లడించారు.
ఇదే సమయంలో విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ పరిశ్రమల వేదికపై సంచలన ప్రకటన చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక నుంచి విశాఖనే ఏపీకి అసలైన రాజధాని అంటూ స్పష్టం చేశారు. దీంతో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలుగా వ్యాపారవేత్తలు క్యూ కట్టారు.
ఈ తరుణంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) కేపిటల్ సిటీ గురించి క్లారిటీ ఇచ్చారు చాలా సార్లు. తాజాగా ఇందుకు సంబంధించి సీఎం జగన్ క్యాంప్ ఆఫీసు త్వరలోనే విశాఖలో ఏర్పాటు కానుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వచ్చే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో విశాఖకు సీఎం జగన్ రెడ్డి మారుతారని వెల్లడించారు టీటీడీ చైర్మన్. ఇదిలా ఉండగా న్యాయ పరమైన అడ్డంకుల వళ్ల క్యాంపు ఆఫీసు తరలింపు ఆలస్యమైందని పేర్కొన్నారు.
Also Read : Opposition Meet : రేపే విపక్షాల కీలక సమావేశం
