YV Subba Reddy : టీటీడీ చైర్మ‌న్ సంచ‌ల‌న కామెంట్స్

రూ. 861 కోట్ల నిధులు వ‌చ్చాయ‌ని వెల్ల‌డి

YV Subba Reddy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి శ్రీ‌వాణి ట్ర‌స్టుపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేశారు. మే 31, 2023 వ‌ర‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ. 861 కోట్లు నిధులు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. వివిధ బ్యాంకుల్లో రూ. 602.60 కోట్లు డిపాజిట్లు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు టీటీడీ చైర్మ‌న్

ఎస్బీఐ ఖాతా కింద రోజూ వారీ వ‌చ్చే డ‌బ్బు రూ. 139 కోట్లు వివిధ బ్యాంకుల్లో ఉంద‌న్నారు. డిపాజిట్ల‌పై వ‌డ్డీ రూపంలో టీటీడీకి రూ. 36.50 కోట్లు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఇక తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆధ్వ‌ర్యంలో అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి. దేవాల‌యాల నిర్మాణం, పురాత‌న ఆల‌యాల పున‌ర్ నిర్మాణానికి ఇప్ప‌టి దాకా రూ. 120.24 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని వెల్ల‌డించారు.

కొంద‌రు కావాల‌ని టీటీడీపై బుర‌ద చ‌ల్లేందుకు య‌త్నిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌కీయ ల‌బ్ది కోసం శ్రీ‌వాణి ట్ర‌స్ట్ పై నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేశార‌ని వాపోయారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy). దేవ‌స్థానంలో ఎంత‌టి వారైనా లేదా ఏ స్థానంలో ఉన్న వారైనా స‌రే అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డేందుకు భ‌య‌ప‌డతార‌ని స్ప‌ష్టం చేశారు.

ఏపీతో స‌హా క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరి రాష్ట్రాల‌లో 127 ప్రాచీన ఆల‌యాల పున‌రుద్ద‌ర‌ణ‌కు రూ. 139 కోట్లు కేటాయించామ‌న్నారు. భ‌జ‌న మందిరాలు, ఎస్సీ, ట్రైబ‌ల్ ప్రాంతాల్లో 2,273 ఆల‌యాల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టామ‌ని చెప్పారు. ఇందు కోసం రూ. 227.30 కోట్ల కేటాయింపులు జ‌రిపామ‌న్నారు.

Also Read : MK Stalin Lalu : లాలూతో ఎంకే స్టాలిన్ ములాఖ‌త్

Leave A Reply

Your Email Id will not be published!