TTD EO : వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వీ యూనివర్శిటీ
స్పష్టం చేసిన టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి
TTD EO : ప్రపంచ వేద విజ్ఞాన కేంద్ర భాండారంగా శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం నిలిచిందని కొనియాడారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ఏవీ ధర్మారెడ్డి. అధీంద్రియ విజ్ఞానం కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విశ్వ విద్యాలయం 18వ వార్షికోత్సవం సందర్బంగా నిర్వహించిన సభలో ఏవీ ధర్మా రెడ్డి ప్రసంగించారు.
వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతర వైదిక అంశాలకు సంబంధించి ప్రపంచంలో ఎవరికి ఏ సందేహం లేదా అనుమానం కలిగినా ఆధారాలతో సహా నివృత్తి చేయగలిగే స్థాయికి వేద విశ్వ విద్యాలయం చేరుకోవాలని పిలుపునిచ్చారు ఈవో.
వేదవిద్య, వేద విజ్ఞానం ఆధునిక సమాజానికి అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ చిత్ర పటంపై తనదైన ముద్ర కనబర్చాలని కోరారు ధర్మారెడ్డి. వేద విద్యను విశ్వ వ్యాప్తం చేసి సమాజం ధర్మ బద్దంగా నడవాలనే ఉద్దేశంతో టీటీడీ(TTD) వేద విశ్వ విద్యాలయం ప్రారంభించిందని చెప్పారు. విద్యార్థులు మరింత రాటు దేలాలని సూచించారు.
తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చేసి, వాటిని పరిష్కరించి అవసరమైన వాటిని పుస్తక రూపంలో తెచ్చే ప్రక్రియ కొనసాగుతోందని ఈవో చెప్పారు. జేఈవో సదా భార్గవి మాట్లాడుతూ వేదాలకు ఆధునిక పరిజ్ఞానానికి ఉన్న సంబంధాన్ని వివరించే దిశగా వేద విశ్వవిద్యాలయం మరింతగా కృషి చేయాలన్నారు.
Also Read : Sonia Gandhi Welcome : విందుకు వెల్ కమ్ – సోనియా