TTD EO AV Dharma Reddy : తాళపత్ర పరిశోధన సంస్థ ఎదగాలి
పిలుపునిచ్చిన ఏవీ ధర్మారెడ్డి
TTD EO AV Dharma Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో భక్తుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రత్యేకించి విద్య, వైద్యం, వైదిక విజ్ఞానంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో ఫ్రాన్స్ నుంచి అత్యాధునిక తాళపత్ర స్కానర్ ను దిగుమతి చేసుకున్నారు. ఈ స్కానర్ ను టీటీడీ కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మా రెడ్డి(TTD EO AV Dharma Reddy), సంయుక్త కార్యనిర్వహణ అధికారిణి సదా భార్గవితో కలిసి ప్రారంభించారు.
TTD EO AV Dharma Reddy Launches
ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. శ్రీ వేంకటేశ్వర తాళపత్ర పరిశోధన సంస్థ దేశంలోనే అతి గొప్ప సంస్థగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. తాళపత్రాల్లో దాగి ఉన్న రహస్యాలను అందరికీ అందించాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం ఈ స్కానర్ ఎంతో ఉపయోగ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థ దేశంలోనే ప్రసిద్ధ తాళపత్ర పరిశోధన కేంద్రంగా అభివృద్ది చెందాలని ఏవీ ధర్మా రెడ్డి ఆకాంక్షించారు.
ఇప్పటికే వేద విశ్వ విద్యాలయం అనేక కోర్సులతో పాటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించు కోవడం బాగుందన్నారు. ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నప్పుడే మనుగడ సాధించడం సాధ్యమవుతుందన్నారు ఏవో ధర్మారెడ్డి.
Also Read : Sanjay Singh : మెంటల్ బ్యాలెన్స్ తప్పిన మోదీ