TTD EO : ఆరోప‌ణ‌లు అబ‌ద్దం అభివృద్ది అద్భుతం

ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు ఎలా

TTD EO : తిరుమ‌ల – నిత్యం వేలాది మంది స్వామి వారిని ద‌ర్శించుకునే భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి తెలిపారు. త‌న గురించి వ్య‌క్తిగ‌తంగా ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

త‌న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు టీటీడీ(TTD) అధికార ప్ర‌తినిధి ఆనం వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి. దీనికి సంబంధించి ఆయ‌న స్పందించారు. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు మీడియాతో మాట్లాడారు ఏవీ ధ‌ర్మా రెడ్డి. విస్తృతంగా ధ‌ర్మ ప్ర‌చారంతో పాటు భ‌క్తుల సౌక‌ర్యాల‌కు పెద్ద పీట వేస్తున్నామ‌ని, సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని ధ‌ర్మా రెడ్డి చెప్పారు.

TTD EO Response

త‌న‌పై అవాస్త‌వాల‌తో కూడిన వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డం బాధాక‌ర‌మ‌ని, వాస్త‌వాలు తెలుసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. ఆయన ఆరోపణలను ఈవో ఖండించారు. ఈవోగా ప‌ని చేయ‌డానికి త‌న‌కు అర్హ‌త లేద‌ని ఆరోపించార‌ని ఇది వాస్త‌వం కాద‌న్నారు.

దేవాదాయ చ‌ట్టం 107వ సెక్ష‌న్ ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ లేదా ఆ పోస్టుకు స‌మాన‌మైన హోదా ఉన్న‌వారు ఈవోగా ప‌నిచేయ‌డానికి అర్హుల‌ని తెలిపారు. తాను 1991 బ్యాచ్ సివిల్ స‌ర్వీసెస్ ఐడిఇఎస్ అధికారిన‌ని, 33 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉంద‌ని చెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వ హోంశాఖ‌లో జాయింట్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేశాన‌ని, ఇది ఏపిలో ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ హోదాతో స‌మాన‌మ‌ని, కావున ఇది క‌లెక్ట‌ర్ కంటే ఎక్కువ హోదా అని వివ‌రించారు. తిరుప‌తికి చెందిన శ్రీ న‌వీన్‌కుమార్‌రెడ్డి త‌న అర్హ‌త‌పై హైకోర్టులో పిటిష‌న్ వేశార‌ని, అయితే, ధ‌ర్మాసనం త‌న అర్హ‌త‌ను ప‌రిశీలించి అర్హుడిగా నిర్ణ‌యిస్తూ పిటిష‌న్‌ను కొట్టివేసింద‌ని తెలిపారు ధ‌ర్మా రెడ్డి.

టీటీడీలో ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌న్నారు. తిరుమ‌ల‌లో ద‌ర్శ‌న ద‌ళారుల‌ను అరిక‌ట్టామ‌ని, శ్రీ‌వాణి ట్ర‌స్టుకు ఇప్ప‌టివ‌ర‌కు రూ.1,021 కోట్ల విరాళాలు అందాయ‌ని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 2500కు పైగా ఆల‌యాలు నిర్మించామ‌ని, 176 పురాత‌న ఆల‌యాల జీర్ణోద్ధ‌ర‌ణ చేప‌ట్టామ‌ని వివ‌రించారు.

వైజాగ్‌, భువ‌నేశ్వ‌ర్‌, జ‌మ్మూ త‌దిత‌ర ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మించామ‌ని చెప్పారు. అదేవిధంగా దాత‌ల స‌హ‌కారంతో రూ.140 కోట్ల‌తో తిరుమ‌ల‌లో మ్యూజియంను ఆధునీక‌రిస్తున్నామ‌ని, రూ.25 కోట్ల‌తో అలిపిరి న‌డ‌క మార్గంలో పైక‌ప్పు, రూ.25 కోట్ల‌తో నూత‌న ప‌ర‌కామ‌ణి భ‌వ‌నం, రూ.15 కోట్ల‌తో బ‌ర్డ్ ఆసుప‌త్రిలో నూత‌న వైద్య‌ప‌రిక‌రాలు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

2019 జూన్ నుండి 2023 అక్టోబ‌రు వ‌ర‌కు దాదాపు రూ.4800 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దాదాపు 3885 కిలోల బంగారం డిపాజిట్లు పెరిగాయ‌ని ఈవో వెల్ల‌డించారు. ఎస్వీబీసీని విస్తృతంగా భ‌క్తుల్లోకి తీసుకెళ్లామ‌ని, భ‌క్తులు స్వ‌చ్ఛందంగా రూ.50 కోట్ల‌కు పైగా విరాళాలు అందిచార‌ని చెప్పారు.

Also Read : Revanth Reddy : సీఎంన‌వుతా సంత‌కం చేస్తా

Leave A Reply

Your Email Id will not be published!