TTD EO Dharma Reddy : సామాజిక..ధార్మిక కార్యక్రమాలపై ఫోకస్
వెల్లడించిన టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి
TTD EO Dharma Reddy : సామాజిక, ధార్మిక కార్యక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఫోకస్ పెడుతోందని కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఆలయాల నిర్వాహకులకు విశ్వాసం, భక్తి తప్పనిసరిగా ఉండాలన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్ లో ఆలయాలు..అంతర్జాతీయ గుడుల కన్వెన్షన్ , ఎక్స్ పో ను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. 30 దేశాలకు చెందిన ఆలయాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
TTD EO Dharma Reddy Said
తిరుమల కొండకు నిత్యం 80 వేల మందికి పైగా దర్శించు కుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా (TTD) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆకట్టుకుంది. ఇందులో దర్శనం, దేవాలయాలు, విద్య, ఆరోగ్యం, అన్న ప్రసాదం, టోన్ షేరింగ్ , శ్రీవారి సేవ, ప్రాచీన విద్యాభ్యాసం, లలిత కళా సంస్థలు, ధార్మిక ప్రచారం, జాగరూకత, భద్రత, అడవులు, ఇంధన వినియోగం , అడవులు, విద్యుత్ వినియోగం, తదితర అంశాలు ఇందులో పొందు పరిచారు.
సామాన్య భక్తులకు 60 శాతం ఉచిత దర్శనం, అన్న, జల ప్రసాదం, వసతి, లలిత కళలు, వేద విద్య, శిల్ప కళ కాలేజీ, బాల మందిర్ , తదితర విద్యా సంస్థలు, 1600 మంది బాల బాలికల వసతి గృహం, 1600 మంది చిన్నారులు విజయవంతంగా నిర్వహించే వివిధ దర్శన విధానాలను ఈవో తెలిపారు.
ఆర్ట్ సెంటర్ , స్విమ్స్ , బర్డ్ ఆస్పత్రులు, తిరుమల లోని అశ్విని అపోలో కార్డియాక్ , ఎస్వీబీసీ , గోశాల , గో సంరక్షణ కార్యక్రమాలు, గో ఆధారిత నైవేద్యం, డ్రై ఫ్లవర్ టెక్నాలజీ , యాత్రికుల రవాణాకు పర్యావరణ అనుకూల బస్సులు ఏర్పాటు చేశామన్నారు ఈవో ధర్మారెడ్డి.
Also Read : TTD Release Tickets : 24న అంగ ప్రదక్షిణ టికెట్ల కోటా విడుదల