TTD EO : డిసెంబర్ లో పద్మావతి ఆస్పత్రి ప్రారంభం
స్పష్టం చేసిన టీటీడీ ఈవో ధర్మా రెడ్డి
TTD EO : దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధర్మారెడ్డి. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఆస్పత్రి పనులను కార్య నిర్వాహణ అధికారి మంగవారం పరిశీలించారు. పనుల ప్రగతిని సమీక్షించారు. గడువు లోగా పూర్తయిన పనుల గురించి ఆరా తీశారు ధర్మారెడ్డి. ఆస్పత్రి నిర్మాణం కోసం సేకరించిన భూమిలో ఉన్న రుయా ఆస్పత్రి క్షయ, ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్స వార్డును పరిశీలించారు.
ఆస్పత్రి నిర్మాణం వేగంగా పూర్తి చేయాల్సి ఉన్నందు వల్ల ప్రస్తుతం ఉన్న వార్డును మరో చోటికి తరలించాలని సూచించారు. స్థలం గుర్తించి కొత్త భవనం నిర్మించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏవీ ధర్మారెడ్డి. పనులు జరుగుతున్న తీరుపై ఈవో సంతృప్తిని వ్యక్తం చేశారు.
అనంతరం ఈవో ధర్మారెడ్డి(TTD EO) మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ లో ఆస్పత్రిని ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అనుకున్న ప్రకారమే గడువు లోపే నిర్మాణం పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న చిన్న పిల్లల హృదయాలయం (గుండె చికిత్సల ఆస్పత్రి) ప్రపంచంలోని ఉత్తమ ఆస్పత్రుల సరసన చేరిందని ఈవో వెల్లడించారు. ఈ ఆస్పత్రిలో ఇప్పటి దాకా 1450 గుండె ఆపరేషన్లను విజయవంతంగా చేపట్టడం జరిగిందని చెప్పారు. జీవన్ ధాన్ కింద కూడా ఆపరేషన్లు చేశామన్నారు. చిన్న పిల్లలకు సంబంధించి గుండె చికిత్సలతో పాటు న్యూరో, న్యూరో సర్జరీ, పల్మనాలజీ, యూరాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ సేలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు ధర్మా రెడ్డి.
Also Read : PM Modi : ఎమ్మెల్సీ కవితపై మోదీ కామెంట్స్
