TTD EO : టీటీడీలో ముఖ ఆధారిత హాజరు స్టార్ట్
ప్రారంభించిన టీటీడీ ఈవో ఏవీ ధర్మా రెడ్డి
TTD EO : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. పటిష్టమైన చర్యలు చేపట్టడంలో భాగంగా టీటీడీలో పని చేస్తున్న ఉద్యోగుల హాజరుకు సంబంధించి ముఖ ఆధారిత హాజరు (ఫేసియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ ) కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు తిరుమలలో టీటీడీ కార్య నిర్వహణ అధికారి (ఈవో) ఏవీ ధర్మా రెడ్డి ప్రారంభించారు.
TTD EO Launch for Biometric
దీనిని టీటీడీ పరిపాలన భవనంలో ఏర్పాటు చేశారు. ముందుగా ఏవో నమోదు చేశారు. దీనిని ప్రారంభించిన అనంతరం ఏవీ ధర్మా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 8,000 మందికి పైగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులు పని చేస్తున్నారని చెప్పారు. అంతే కాకుండా అదనంగా మరో 10,000 మందికి పైగా కాంట్రాక్టు (ఒప్పంద) , ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నారని స్పష్టం చేశారు .
వీరందరికీ ముఖ ఆధారిత హాజరును అమలు చేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ఉద్యోగులు, సిబ్బందిలో క్రమ శిక్షణ, పని సామర్థ్యం పెరుగుతుందన్నారు. తిరుమల, తిరుపతి లోని టీటీడీ(TTD) కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఇతర సంస్థల్లో ముఖ ఆధారిత హాజరును అమలు చేస్తామని వెల్లడించారు ధర్మా రెడ్డి. ఈ విధానం పట్ల ఉద్యోగులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read : Krishnajyothi Swaroopanda Swamy : యాగం జీవన యోగం