TTD EO : సర్వ దర్శనం టోకెన్లు జారీ – ఈవో
నవంబర్ 1 నుండి జారీ చేస్తామన్న రెడ్డి
TTD EO : శ్రీవారి భక్తులకు తీపికబురు చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తుల రాక భారీగా పెరిగింది. ఇక సెలవు రోజులు వస్తే చాలా భారీ ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఒక్కోసారి లక్షకు దగ్గరగా భక్తుల రాక ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
తప్పనిసరి అయితే తప్ప సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకోవడం లేదు. తాజాగా టీటీడీ ఈవో(TTD EO) సంచలన ప్రకటన చేశారు. నవంబర్ 1 నుండి తిరుపతిలో సర్వ దర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు టీటీటీ ఈవో ధర్మా రెడ్డి. పుణ్య క్షేత్రంలోని భూదేవి కాంప్లెక్స్ రెండో సత్రం శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు.
శని, ఆది, సోమ, బుధ దినవారాలలో 20 నుండి 25 వేల వరకు ఉచిత దర్శనం టోకెన్లు జారీ చేస్తామని స్పష్టం చేశారు ధర్మారెడ్డి. ఇక మంగళ, గురు, శుక్రవారాలలో రోజుకు 15,000 టోకెన్ల చొప్పున సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఏ రోజు కారోజు టోకెన్లు మాత్రమే ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా టోకెన్లు అందని భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. టోకెన్లు లేకుండానే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండి శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకునే అవకాశం ఇక నుంచి కల్పిస్తున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా డిసెంబర్ 1 నుండి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 8 గంటల నుండి 11.30 గంటల వరకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు ఈవో ధర్మారెడ్డి.
Also Read : ఒకే దేశం ఒకే పోలీస్ ఒకే యూనిఫాం – మోదీ