TTD EO : శ్రీ‌వారి సేవ‌కు డ‌బ్బులు అక్క‌ర్లేదు – ఈవో

డ‌య‌ల్ యువ‌ర్ కార్య‌క్ర‌మంలో ధ‌ర్మారెడ్డి

TTD EO : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD) ఈవో ధ‌ర్మారెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌వారి సేవ కోసం ఎవ‌రికీ డ‌బ్బులు చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో ధ‌ర్మారెడ్డి భ‌క్తులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. ఆన్ లైన్ విధానం ద్వారా సేవ చేసే భాగ్యాన్ని కూడా క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి సేవ ఆన్ లైన్ ద్వారా మాత్ర‌మే కేటాయిస్తున్న‌ట్లు తెలిపారు.

TTD EO Announced

తిరుమ‌ల‌లో ఇటీవ‌లే రూ. 120 కోట్ల‌తో 6 వేల గ‌దుల‌ను ఆధునీక‌రించ‌డం జ‌రిగింద‌న్నారు ఈవో. తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌స‌తి పొందేందుకు ఆన్ లైన్ లో ఒకేసారి విడుద‌ల చేస్తున్నామ‌ని చెప్పారు. సేవ టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ , ల‌క్కీ డిప్ విధానం, తిరుమ‌ల సీఆర్ఓ వ‌ద్ద ఒక రోజు ముందుగా పేర్ల‌ను న‌మోదు చేసుకుంటే డిప్ ద్వారా సేవా టికెట్లు కేటాయిస్తామ‌న్నారు ధ‌ర్మారెడ్డి.

ప్ర‌తి రోజూ ఆన్ లైన్ లో రూ. 300, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు 15 వేలు , ఎస్ఎస్డి టోకెన్లు 15 వేలు, దివ్య ద‌ర్శ‌నం టోకెన్లు 15 వేలు జారీ చేస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి రోజు అంగ ప్ర‌ద‌క్షిణ‌కు 750 టికెట్లు ఇస్తున్నామ‌ని తెలిపారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం చేసుకున్న ప్ర‌తి ఒక్క‌రికీ ఒక ఉచిత ల‌డ్డు ఇవ్వాల‌ని టీటీడీ నిర్ణ‌యించింద‌న్నారు. వైకుంఠ ఏకాద‌శికి డిసెంబ‌ర్ లో రూ. 300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు , శ్రీ‌వాణి టికెట్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు చెప్పారు ఈవో.

Also Read : Chandrababu Naidu : జ‌గ‌న్ మాఫియా కింగ్ – చంద్ర‌బాబు

Leave A Reply

Your Email Id will not be published!