TTD EO : వేగంగా భ‌క్తుల ల‌గేజి నిర్వ‌హ‌ణ

టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి

TTD EO : టీటీడీ ఈవో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తులు త‌మ ల‌గేజీని, మొబైల్ ఫోన్ల‌ను డిపాజిట్ చేసి తిరిగి తీసుకునే ప్ర‌క్రియ‌ను మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా , వేగంగా అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. డిజిట‌లైజేష‌న్ , ఆటోమేష‌న్ ద్వారా నూత‌నంగా బాలాజీ బ్యాగేజ్ మేనేజ్ మెంట్ సిస్ట‌మ్ ను అమ‌లు చేస్తున్న‌ట్లు చెప్పారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సివిఎస్వో న‌ర‌సింహ కిషోర్‌తో క‌లిసి ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

TTD EO Said about the latest developments

మొబైల్ ఫోన్ల‌ను డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోవ‌డం ఆల‌స్యం అవుతుంద‌ని భావించి కొంద‌రు భ‌క్తులు ఆల‌యం లోకి తీసుకు వెళుతున్నార‌ని అన్నారు. దీనిని అరికట్టేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌స్తుత విధానంలో ల‌గేజి గానీ, మొబైల్ ఫోన్లు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను డిపాజిట్ చేస్తే ఎక్కువ స‌మ‌యం వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు ఈవో ధ‌ర్మా రెడ్డి(TTD EO).

కొత్త విధానంలో భ‌క్తులు ల‌గేజ్ కౌంట‌ర్ వ‌ద్ద‌కు చేరుకోగానే వారి ద‌ర్శ‌న టికెట్ ను స్కాన్ చేస్తార‌ని తెలిపారు. వారి వివ‌రాలు డివైస్ లోకి ఎంట‌ర్ అవుతాయ‌ని పేర్కొన్నారు. ఇక ద‌ర్శ‌న టికెట్ లేని వాళ్ల‌కు వారి వివ‌రాలు, పేరు న‌మోదు చేసుకుంటార‌ని, బ్యాగ్ కు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ క్లిప్ జ‌త చేస్తార‌ని చెప్పారు. క్యూ ఆర్ కోడ్ ర‌శీదు ఇస్తార‌ని తెలిపారు. ల‌గేజీ వాహ‌నాల‌కు జీపీఎస్ అమ‌ర్చ‌డం వ‌ల్ల మేలు జ‌రుగుతుంద‌న్నారు.

ఈ నూత‌న విధానం ఒక నెల నుండి అమ‌ల‌వుతోంద‌న్నారు ఈవో ధ‌ర్మా రెడ్డి. ప్ర‌తి రోజూ 60 వేల ఫోన్లు, 40 వేల‌కు పైగా బ్యాగుల‌ను డిపాజిట్ , డెలివ‌రీ చేయ‌డం జ‌రుగుతోంద‌ని చెప్పారు. . 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం, సర్వదర్శనం, సుపథం, శ్రీవారి మెట్టు, అలిపిరి వద్ద డిపాజిట్ కేంద్రాలు ఏర్పాటు చేశామ‌న్నారు. అదేవిధంగా కామన్ లగేజ్ కేంద్రాల వద్ద 20 కౌంటర్లు, జిఎన్సి వద్ద 6 కౌంటర్లు, టీబీసీ వద్ద 2 లగేజీ తిరిగి ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేశామ‌న్నారు.

Also Read : IJU TUWJ : ఇళ్ల స్థ‌లాలు స‌రే కామెంట్స్ మాటేంటి

Leave A Reply

Your Email Id will not be published!