TTD EO : స్విమ్స్ లో అన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌కు చికిత్స

టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి వెల్ల‌డి

TTD EO : స్విమ్స్ లో ఏర్పాటు చేస్తున్న శ్రీ బాలాజీ ఇన్సిట్యూట్ ఆఫ్ అంకాల‌జీ (క్యాన్స‌ర్ హాస్పిట‌ల్ ) లో అన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌కు అత్యుత్త‌మ వైద్య చికిత్స‌లు అందించేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి. ఇందుకు గాను అత్యాధునిక వైద్య వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

TTD EO Words

శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా వైద్య క‌ళాశాల‌లో జూలై 22 వ తేదీ వ‌ర‌కు క్యాన్స‌ర్ అవ‌గాహ‌న , స్క్రీనింగ్ ప‌రీక్ష‌ల పై క‌మ్యూనిటీ హెల్త్ ఆఫీస‌ర్లు, మిడ్ లెవ‌ల్ హెల్త్ ప్రొవైడ‌ర్ల‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఈవో ధ‌ర్మారెడ్డి పాల్గ‌ని ప్ర‌సంగించారు.

క్యాన్స‌ర్ వ‌ల్ల దేశంలో ప్ర‌తి ఏడాది 7 ల‌క్ష‌ల మంది చ‌ని పోతున్నార‌ని వెల్ల‌డించారు. క్యాన్స‌ర్ ను తొలి ద‌శ‌లోనే గుర్తించ‌డం , స‌రైన చికిత్స అందించ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు వీల‌వుతుంద‌న్నారు ఈవో. ఆహారం, జీవ‌న విధానంలో కీల‌క మార్పులు చోటు చేసుకోవ‌డం వ‌ల్ల రోగాల పాల‌వుతున్నార‌ని పేర్కొన్నారు.

ర‌సాయ‌న ఎరువులు, క్రిమి సంహార‌క మందుల‌తో పండిస్తున్న ఉత్ప‌త్తుల క్యాన్స‌ర్, త‌దిత‌ర ప్రాణాంత‌క వ్యాధుల‌కు గుర‌వుతున్నార‌ని ఈవో చెప్పారు. రోగాల బారాన ప‌డ‌కుండా ఉండేందుకు ఏ ర‌క‌మైన జీవ‌న విధానం అల‌వ‌ర్చు కోవాల‌నే విష‌యాలు ప‌తంజ‌లి మ‌హ‌ర్షి యోగ శాస్త్రంలో వివ‌రించార‌ని తెలిపారు ఏవీ ధ‌ర్మారెడ్డి. యోగాను సాధ‌న చేస్తే శ‌రీరాన్ని నియంత్రించుకునే వీలు ఉంద‌న్నారు. గో ఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా పండించిన ఉత్ప‌త్తుల‌ను వాడితే వీటికి దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని తెలిపారు.

Also Read : Sunil Kanugolu : సునీల్ క‌నుగోలుపై రేవంత్ గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!