TTD : తిరుమలకు పెరుగుతున్న ఆదాయం
భక్తులకు మరిన్ని వసతి సౌకర్యాలు
TTD : ప్రపంచంలోనే అత్యధిక భక్తుల్ని కలిగి ఉన్న ఆలయంగా ప్రసిద్ది చెందింది తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలు కొలువు తీరిన ఈ పుణ్య క్షేత్రానికి రోజు రోజుకు దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
గతంలో కరోనా కారణంగా దర్శనాలు తగ్గాయి. కానీ కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తుల రద్దీ పెరుగుతోంది. టీటీడీ(TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టారు.
వినూత్నమైన కార్యక్రమాలు తీసుకు రావడం కూడా ఇందుకు మేలు చేకూర్చేలా చేసింది. గతంలో దళారీల వ్యవస్థ ఎక్కువగా ఉండేది. ప్రతిదానికీ ఓ రేటు అంటూ ఉండేది.
కానీ కొత్త పాలక వర్గం మరింత కట్టుదిట్టగాంగా అమలు చేస్తోంది. దీంతో ప్రతి రోజూ శ్రీవారి ఆదాయం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రతి ఏటా రూ. 500 కోట్లు దాటడం విశేషం.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎక్కువగా కోరుకునేది శ్రీవారి ప్రసాదం (లడ్డు). దర్శనం కావాలన్నా, ప్రసాదం తీసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడే వారు. కానీ వాటికి పూర్తిగా చెక్ పెట్టింది.
ప్రతి దానిని ఆన్ లైన్ లోకి తీసుకు వచ్చింది. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశమే లేదు భక్తులకు. 2004 కంటే ముందు రోజుకు లక్ష లడ్డూలు మాత్రమే తయారు చేసే వారు.
కానీ ఆ తర్వాత సీన్ మారింది. భక్తులు ఎన్ని లడ్డూలైనా తీసుకునే వీలు కల్పిస్తూ టీటీడీ చర్యలు తీసుకుంది. ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండానే వీటిని అందజేస్తున్నారు.
దీంతో ప్రసాదం దొరకడం లేదన్న నిరాశ లేకుండా పోయింది. ఇక మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది టీటీడీ. ఆలయాల పునరుద్దరణ కోసం ఏర్పాటు చేసిన రూ. 10 వేల పథకానికి భారీ స్పందన లభిస్తోంది.
Also Read : అమెరికాలో శ్రీవారి కళ్యాణోత్సవాలు