TTD Pushpa Yagam : శ్రీవారి పుష్ప యాగానికి టీటీడీ సిద్దం
ఏర్పాట్లలో నిమగ్నమైన బోర్డు
TTD Pushpa Yagam : కరోనా తర్వాత తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రోజుకు వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక వచ్చే నెల నవంబర్ 1న శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పుష్ప యాగం ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది.
ఇక స్వామి వారి యాగాన్ని కనులారా వీక్షించేందుకు గాను ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు భక్తులు. ఇక స్వామి వారి దర్శనం కోసం సమయం మరింత పెరుగుతోంది. ఎన్ని ఏర్పాట్లు చేసినా దర్శన భాగ్యం కలగాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిందే.
ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా సిఫార్సు లేఖలు రద్దు చేసింది టీటీడీ. ఇదిలా ఉండగా శ్రీవారి పుష్ప యాగం (TTD Pushpa Yagam) ఇప్పటి నుంచి కాదు గత 15వ శతాబ్దం కాలం నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు.
బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణం జరిగిన వారం రోజుల తర్వాత ఆ గోవిందుడికి పుష్ప యాగం చేసే వారని ప్రతీతి. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పూలను విరాళంగా దాతలు అందజేస్తున్నారు. ఇందుకు గాను పుష్పయాగం టికెట్లను ఈనెల 10న సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనున్నట్లు తెలిపింది.
రూ. 700 ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారికి ఈ గౌరవం దక్కనుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలు అందజేస్తారు. పుష్ప యాగం చేపడతారు. ప్రస్తుతం భక్తుల రద్దీ పెరగడంతో హుండీ ఆదాయం కూడా ఘనంగా పెరుగుతోంది టీటీడీకి.
Also Read : వసూళ్లలో పొన్నియిన్ సెల్వన్ హవా