TTD IT Wing Case File : నకిలీ సైట్స్ పై టీటీడీ ఐటీ ఫిర్యాదు
ఉద్యోగాల భర్తీ అంతా అబద్దం
TTD IT Wing Case File : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఐటీ విభాగం(TTD IT Wing) గురువారం ఫిర్యాదు చేసింది. పదవ తరగతి ఉత్తీర్ణతతో ఒక లక్ష జీతంతో టీటీడీలో రిక్రూట్ మెంట్ చేస్తున్నట్లు నిరుద్యోగులను మోసం చేస్తున్నాయంటూ పేర్కొంది. ఐటీ విభాగం గత కొన్ని రోజుల నుంచి నకిలీ సైట్లను గుర్తించిందని తెలిపింది.
ఫేక్ వెబ్ సైట్స్ తో పాటు సోషల్ మీడియా హ్యాండిల్ ను ఐడెంటిఫై చేసినట్లు పేర్కొంది టీటీడీ ఐటీ విభాగం. ఇవి పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వీటిని బ్లాక్ చేయాలని కోరుతూ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
తప్పుడు వార్తలను నిరుద్యోగులు నమ్మవద్దని కోరింది. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది నకిలీ మీడియా ప్లాట్ ఫామ్ లను గుర్తించినట్లు ఐటీ జీఎం సందీప్ ఇవాళ తిరుమల లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీటీడీ ఐటీ వింగ్ వెబ్ సైట్ లు, సోషల్ మీడియాలను నకిలీ సామాజిక మాధ్యమాల చిరునామాలను కూడా గుర్తించడం జరిగిందని స్పష్టం చేసింది టీటీడీ ఐటీ విభాగం.
ఇలాంటి తప్పుడు వార్తల వల్ల చాలా మంది మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వీటికి బలి కావద్దంటూ కోరింది. ఒకవేళ కొలువుల భర్తీకి సంబంధించి కేవలం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారా మాత్రమే ప్రకటిస్తామని స్పష్టం చేశారు ఐటీ వింగ్ చీఫ్.
Also Read : CM Himachal Pradesh