TTD : అంగ రంగ వైభవంగా పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం....

TTD : పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు తిరుమల, తిరుపతి, తిరుచ్చనూరులో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంతోత్సవంలో భాగంగా ఉదయం అమ్మవారిని ‘సుప్రభాతం’తో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2:00 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుంచి ఊరేగింపుగా శుక్రవారం గార్డెన్‌కు తీసుకెళ్లి అక్కడ స్నపన తిరుమంజనం నిర్వహించారు.

TTD Padmavathi Amma…

పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం. అనంతరం రాత్రి ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో అమ్మవారిని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉప ప్రధాన ఆలయ అధికారి గోవిందరాజన్, ఆలయ అర్చకుడు బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, భక్తులు పాల్గొన్నారు.

Also Read : Bomb Threats : కేంద్ర హోమ్ శాఖకు బాంబు బెదిరింపులు

Leave A Reply

Your Email Id will not be published!