TTD : శ్రీవారి దర్శనం మరింత ఆలస్యం
ఆగస్టు 21 దాకా సిఫారసు లేఖలకు బ్రేక్
TTD : వరుసగా సెలవులు రావడంతో తిరుమల శ్రీవారి ఆలయం భక్తులతో నిండి పోయింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మరింత భక్తుల తాకిడి పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.
దీంతో స్వామి, అమ్మ వార్ల దర్శనం మరింత ఆలస్యం అవుతోంది. ఏకంగా 48 గంటలు పడుతోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల తల్లులు, వృద్దులు ఎక్కువగా రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.
దర్శన భాగ్యానికి మరింత ఆలస్యం పడుతుండడంతో దయచేసి తిరుమలకు వచ్చే భక్తులు, రావాలని అనుకుంటున్న వారు వెంటనే తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని సూచించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి.
భక్తుల రద్దీ దెబ్బకు ఇక రావద్దంటూ కోరారు. రెండు రోజులకు పైగా స్వామి వారి దర్శనానికి పడుతుండడంతో ఆగస్టు 21వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు, చైర్మన్లు జారీ చేసే సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ స్పష్టం చేశారు.
ఎక్కువ సంఖ్యలో వస్తే తాము సౌకర్యాలు కల్పించలేమంటూ చేతులెత్తేశారు. ఇప్పటికే నిత్య అన్నదానం, ప్రసాదంలో కూడా నాణ్యత లోపించిందని భక్తులు ఆరోపిస్తున్నారు.
ఒక్క రోజే 65 వేలకు పైగా దర్శనం చేసుకోవడం విశేషం. కానుకల రూపంలో రూ. 3.52 కోట్లు వచ్చాయి శుక్రవారం నాటికి. ఇదిలా ఉండగా దర్శనం కోసం నిలిచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Also Read : నారా లోకేష్ ఆస్తులు రూ. 369 కోట్లు