TTD Security : బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత
భారీగా తరలి వచ్చిన భక్తులు
TTD Security : తిరుమలలో రెండు సంవత్సరాల తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఇవి కొనసాగుతాయి. కరోనా మహమ్మారి కారణంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించ లేక పోయింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇదిలా ఉండగా భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు.
స్వామి వారిని దర్శించుకునేందుకు. దీంతో ముందస్తుగా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రత్యేకించి సిఫారసు, వీఐపీ లెటర్లను నిలుపుదల చేసింది. ఇక సామాన్య భక్తుల దర్శనానికి తాము ప్రయారిటీ ఇస్తున్నట్లు ఇప్పటికే టీటీడీ ఈఓ వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు టీటీడికి స్థిరాస్థుల ఆదాయం రూ. 85 వేల కోట్లకు పైగా ఉందని ప్రకటించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. కాగా బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు గాను మూడెంచల భద్రతా విధానం(TTD Security) అమలు చేస్తున్నట్లు టీటీడీ సీవీఎస్ ఓ నరసింహ కిషోర్ వెల్లడించారు.
ప్రతి ఒక్కరినీ పరిశీలించిన తర్వాత ఆలయంలోకి అనుమతి ఇస్తామని చెప్పారు. ఇందులో భాగంగా మొదటి దశలో అలిపిరి చెక్ పాయింట్ వద్ద తనిఖీ చేస్తామన్నారు. రెండో దశలో శ్రీవారి ఆలయంలోకి ఎంటర్ అయ్యే ముందు పరిశీలిస్తామని తెలిపారు.
మూడో దశలో మాడ వీధుల్లోకి పర్మిషన్ ఇచ్చే ముందు తనిఖీలు ఉంటాయన్నారు. మొత్తం 2,200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
ఎక్కడ చిన్న అనుమానం వచ్చినా తాము భక్తులను లోపలికి వెళ్లనిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక బలగాలను కూడా మోహరించారు కొండపై.
Also Read : టీటీడీ ఆస్తుల విలువ రూ. 85,705 కోట్లు