TTD Tickets : 24న రూ. 300 ప్రత్యేక దర్శన టికెట్లు
కోటా విడుదల చేస్తామన్న టీటీడీ
TTD Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు శ్రీవారి దర్శనం కోసం లక్షలాది మంది వేచి చూస్తారు. ఆ దేవ దేవుడిని దర్శించుకుంటే చాలు అని పరితపిస్తారు. వేసవి కాలం కావడం, సెలవులు ప్రకటించడంతో పెద్ద ఎత్తున భక్తులు తండోప తండాలుగా తరలి వస్తున్నారు తిరుమలకు. ఎక్కడ చూసినా భక్తులతో నిండి పోయింది పుణ్య క్షేత్రం.
తాజాగా టీటీడీ(TTD) శుభ వార్త చెప్పింది. మే 24న శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు గాను ప్రతి సారి విడుదల చేసే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల స్వామి వారిని దర్శించుకునేందుకు వీలు కలుగుతుంది. వచ్చే జూలై , ఆగస్టు నెలల కోటాను ఈనెల 24న బుధవారం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
వీటిని ఆన్ లైన్ లో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. టీటీడీ(TTD) యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా నేరుగా బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇతరులు ఎవరైనా టికెట్లు ఇస్తామని చెబితే నమ్మవద్దని కేవలం అధికారికంగా టీటీడీకి సంబంధించి వెబ్ సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. భక్తులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది తిరుమల తిరుపతి దేవస్థానం.
Also Read : Somu Veerraju