TTD Brahmotsavam : బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్దం
27 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు
TTD Brahmotsavam : కరోనా కారణంగా ఆగి పోయిన వార్షిక బ్రహ్మోత్సవాలు(TTD Brahmotsavam) తిరిగి ప్రారంభం కానున్నాయి. పూర్తిగా రెండు సంవత్సరాల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమలలో శ్రీవారి వార్షింక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఇందుకు సంబంధించి టీటీడీ రెడీ అయ్యింది. సెప్టెంబర్ 27 నుంచి వచ్చే అక్టోబర్ నెల 5వ తేదీ దాకా ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలోని ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహిస్తారు.
26న అంకురార్పణ, అక్టోబర్ 1న స్వామి వారికి సంబంధించి గరుడ సేవ నిర్వహించనున్నారు. కరోనా మహమ్మారి వల్ల టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు ఆలయంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించింది. కేంద్ర సర్కార్ నిర్దేశించిన రూల్స్ ప్రకారం టీటీడీ నడుచుకుంది.
తాజాగా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనం కలిగించేలా చేస్తోంది.
ఈసారి మాడ వీధుల్లో వాహన సేవలు జరగనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది.
గతంలో ఎన్నడూ లేనంతగా కుప్పలు తెప్పులుగా తరలి వస్తున్నారు భక్తజనం. మరో వైపు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈనెల 20న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్దంగా స్వామి వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా ఎలాంటి సిఫారసు లేఖలను తీసుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది టీటీడీ.
Also Read : విక్రాంత్ లో ప్రయాణం మోదీ ఉద్వేగం