TTD Brahmotsavam : శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 దాకా
TTD Brahmotsavam : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా నిర్వహించకుండా వస్తూ వచ్చిన శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈసారి నిర్వహించాలని నిర్ణయించింది.
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పాలక మండలి ఓకే చెప్పింది. ఈ ఉత్సవాలను తిరువీధి ఊరేగింపుగా నిర్వహించాలని నిర్ణయించింది.
ఇక తిరుమల బ్రహ్మోత్సవాలను(TTD Brahmotsavam) వచ్చే సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5 వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల ప్రారంభం రోజున ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సందింటి జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
అక్టోబర్ 1న గరుడ సేవ చేపడతారు. అయితే ఉత్సవాలు ఉన్నప్పటికీ తిరుమలలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సర్వ దర్శనం ప్రతీ రోజూ దర్శనం కొనసాగుతుందని టీటీడీ స్పష్టం చేసింది.
అయితే ఇందుకు సంబంధించి స్లాట్ విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అంతే కాకుండా తిరుమలలో ఉన్న పార్వేట మండపం ఆధునీకరణ చేసేందుకు రూ. 2.20 కోట్ల నిధులు కేటాయించింది.
అమరావతిలో శ్రీవారి ఆలయం చుట్టూ ఉద్యానవన అభివృద్దికి రూ. 2.20 కోట్లు కేటాంచింది టీటీడీ పాలక మండలి. ప్రతి ఏటా విడుదల చేసే తిరుమల తిరుపతి దేవస్థానం డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు ఆమోదం తెలిపింది
. బేడి ఆంజనేయ స్వామి కవచాలకు, ఆనంద నిలయం కు బంగారు తాపడం పనులు చేపట్టేందుకు ఓకే తెపింది. ఇందుకు సంబంధించి ఆగమ శాస్త్ర పండితులతో సంప్రదిస్తామని టీటీడీ బోర్డు చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు.
త్వరలోనే తిరుప్పావడ సేవను కూడా స్టార్ట్ చేస్తామన్నారు.
Also Read : జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోదీ