Tummala Nageswar Rao : వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటా
తుమ్మల నాగేశ్వర్ రావు కామెంట్
Tummala Nageswar Rao : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మద్దతు దారులు పెద్ద ఎత్తున శుక్రవారం ఖమ్మంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన కోసం వచ్చిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు తుమ్మల నాగేశ్వర్ రావు.
నాకు ఈ ఎన్నికలు పెద్దగా అవసరం లేదన్నారు. నాకు రాజకీయంగా పదవి ముఖ్యం కాదని స్పష్టం చేశారు. నా ఖమ్మం జిల్లా కోసం ఇక్కడి ప్రజల కోసం రాబోయే ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
Tummala Nageswar Rao in Elections
ఈ జిల్లా ప్రజలు నన్ను ఆశీర్వదించారు. అంతకు మించి తనకు అడుగడుగునా మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఏమిచ్చినా మీ రుణం నేను తీర్చుకోలేనని అన్నారు. ఒకింత ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకైనా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూశానని అన్నారు. నా ప్రజలందరి కోసమైనా నేను పోటీలో ఉండాలని అనుకుంటున్నట్లు చెప్పారు తుమ్మల నాగేశ్వర్ రావు(Tummala Nageswar Rao).
ఈసారి జరిగే శాసనసభ ఎన్నికల్లో తన సత్తా ఏమిటో చూపిస్తానని స్పష్టం చేశారు. మరో వైపు తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన కామెంట్స్ ఖమ్మం జిల్లాలో కలకలం రేపాయి. ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. మంత్రిగా కూడా పని చేశారు.
Also Read : MLC Kavitha : బరా బర్ 100 సీట్లు గెలుస్తం